iDreamPost
android-app
ios-app

వీడియో: తగలరాని చోట తాకిన బాల్‌.. నొప్పితో విలవిల్లాడిన బాబర్‌ ఆజమ్‌!

  • Published Aug 16, 2024 | 5:22 PM Updated Updated Aug 16, 2024 | 5:22 PM

Babar Azam, Khurram Shahzad, Pakistan: పాకిస్థాన్‌ టీ20, వన్డే కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా బాల్‌ తగలరాని చోటు తగిలింది. అయితే.. బాబర్‌ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎవరి బౌలింగ్‌లో దెబ్బ తాకిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 16, 2024 | 5:22 PMUpdated Aug 16, 2024 | 5:22 PM
వీడియో: తగలరాని చోట తాకిన బాల్‌.. నొప్పితో విలవిల్లాడిన బాబర్‌ ఆజమ్‌!

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌, వైట్‌ బాల్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఓ యువ బౌలర్‌ బౌలింగ్‌లో ఆడుతూ.. తగలరాని చోట బాల తగలడంతో ఇబ్బంది పడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ యువ బౌలర్‌ ఖుర్రం షాజాద్ వేసిన ఇన్‌స్వింగ్‌ డెలవరీని ఎదుర్కొవడంలో విఫలమైన బాబర్‌ ఆజమ్‌ స్వల్పంగా గాయపడ్డాడు. బాల్‌ నేరుగా వచ్చి.. ప్రైవేట్‌ పార్ట్‌పై తాకడంతో నొప్పిని తట్టుకోలేక.. అలానే కూర్చుండిపోయాడు. వెంటనే బాబర్‌కు ప్రథమ చికిత్స అందించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌ టీమ్‌కు బ్యాక్‌బోన్‌ లాంటి బాబర్‌ ఆజమ్‌.. నెట్స్‌లో గాయపడటంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో స్వదేశంలో జరిగే సిరీస్‌ కోసం.. బాబర్‌ ఆజమ్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత కొంత కాలంగా పాకిస్థాన్‌ టీమ్‌ ప్రదర్శనతో పాటు.. బాబర్‌ ఆజమ్‌ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంత బాగా లేదు. దీంతో.. కనీసం బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనైనా తన ఫామ్‌ను అందుకోవాలని బాబర్‌ పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం ప్రాక్టీస్‌ చేస్తుంటే ఇలా దురదృష్టవశాత్తు బాల్‌ తగిలి నొప్పితో బాధపడ్డాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Cricket Pakistan (@officialcricketpakistan)