Suryakumar Yadav: సూర్యకుమార్​కు అరుదైన గౌరవం.. అందరు తోపులను కాదని..!

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్​కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ క్రికెట్​లోని చాలా మంది తోపులను కాదని ఇది మిస్టర్ 360కి సొంతమైంది.

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్​కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ క్రికెట్​లోని చాలా మంది తోపులను కాదని ఇది మిస్టర్ 360కి సొంతమైంది.

సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు తెలియని టీమిండియా ఫ్యాన్ ఉండడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత జట్టులోకి లేటుగా వచ్చినా తక్కువ టైమ్​లోనే స్టార్ ప్లేయర్​గా మారాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో భారత జట్టులోకి కీలక ప్లేయర్​గా మారిన సూర్య.. అదే పెర్ఫార్మెన్స్​లను కంటిన్యూ చేస్తూ స్టార్​గా అవతరించాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్​లో అతడి ఆట చూసి తీరాల్సిందే. బౌలర్ ఎవరు? సిచ్యువేషన్ ఏంటనేది పట్టించుకోకుండా.. విభిన్నమైన షాట్లతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడతాడు స్కై. కీపర్ తల మీద నుంచి సిక్సులు బాదుతూ బౌలర్లను కన్​ఫ్యూజ్ చేస్తాడు. ఎటువైపైనా అలవోకగా సిక్సులు బాదే సామర్థ్యం ఉన్న సూర్యకు బౌలింగ్ చేయాలంటే స్టార్ బౌలర్లు కూడా జడుసుకుంటారు. అంతగా పొట్టి క్రికెట్​లో తనదైన ముద్ర వేశాడు స్కై. అలాంటోడికి అరుదైన గౌరవం దక్కింది. తోపు క్రికెటర్లను కాదని.. సూర్యకుమార్​కు ఓ గౌరవం లభించింది.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. 2023 ఏడాదికి గానూ బెస్ట్ టీమ్​ను అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు సూర్యకుమార్​ను కెప్టెన్​గా నియమించింది. ఈ టీమ్​లో యశస్వి జైస్వాల్, సాల్ట్, నికోలస్ పూరన్, సూర్యకుమార్, చాప్​మన్, సికందర్ రజా, రంజానీ, మార్క్ అడైర్​తో పాటు రవి బిష్ణోయ్, గరవా, అర్ష్​దీప్ సింగ్​లు సభ్యులుగా ఉన్నారు. భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఈసారి చోటు దక్కించుకోవడం విశేషం. సూర్యతో పాటు జైస్వాల్, బిష్ణోయ్, అర్ష్​దీప్ ఈ టీమ్​లో సభ్యులుగా ఉన్నారు. అయితే ఎందరో తోపు క్రికెటర్లు ఉన్నప్పటికీ టీ20 క్రికెట్​లో గతేడాది దుమ్మురేపిన సూర్యకుమార్​నే కెప్టెన్​గా ఎంచుకుంది ఐసీసీ. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన సూర్య.. అటు బ్యాటింగ్​లో రాణించడంతో పాటు ఇటు సారథిగానూ ఆకట్టుకున్నాడు. అందుకే ఐసీసీ అతడ్ని కెప్టెన్​గా నియమించిందని తెలుస్తోంది.

ఇక, సౌతాఫ్రికా సిరీస్​లో గాయపడ్డ సూర్యకుమార్ ప్రస్తుతం హాస్పిటల్​లో ఉన్నాడు. ఇంజ్యురీ తర్వాత కొన్నాళ్లు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్ అకాడమీలో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు స్కై. అయితే గాయం తగ్గకపోవడంతో జర్మనీకి వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్యకు డాక్టర్లు సక్సెస్​ఫుల్​గా సర్జరీ కంప్లీట్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోలను మిస్టర్ 360 తన అభిమానులతో పంచుకున్నాడు.

ఆపరేషన్ విజయవంతమైందని.. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్ట్​లో రాసుకొచ్చాడు సూర్య. త్వరలోనే అందరి ముందుకు వస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టీ20 టీమ్​కు కెప్టెన్​గా ప్రకటించడంతో సూర్యతో పాటు అతడి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది సూర్య ప్రతిభకు దక్కిన గౌరవం అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతేడాది 18 టీ20లు ఆడిన సూర్య 43.1 స్ట్రయిక్ రేట్​తో 733 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉండటం విశేషం. మరి.. ఐసీసీ టీ20 టీమ్​కు సూర్య కెప్టెన్​గా ఎంపికవడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments