Nidhan
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ క్రికెట్లోని చాలా మంది తోపులను కాదని ఇది మిస్టర్ 360కి సొంతమైంది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ క్రికెట్లోని చాలా మంది తోపులను కాదని ఇది మిస్టర్ 360కి సొంతమైంది.
Nidhan
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు తెలియని టీమిండియా ఫ్యాన్ ఉండడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత జట్టులోకి లేటుగా వచ్చినా తక్కువ టైమ్‌లోనే స్టార్ ప్లేయర్‌గా మారాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత జట్టులోకి కీలక ప్లేయర్‌గా మారిన సూర్య.. అదే పెర్ఫార్మెన్స్లను కంటిన్యూ చేస్తూ స్టార్‌గా అవతరించాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో అతడి ఆట చూసి తీరాల్సిందే. బౌలర్ ఎవరు? సిచ్యువేషన్ ఏంటనేది పట్టించుకోకుండా.. విభిన్నమైన షాట్లతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడతాడు స్కై. కీపర్ తల మీద నుంచి సిక్సులు బాదుతూ బౌలర్లను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎటువైపైనా అలవోకగా సిక్సులు బాదే సామర్థ్యం ఉన్న సూర్యకు బౌలింగ్ చేయాలంటే స్టార్ బౌలర్లు కూడా జడుసుకుంటారు. అంతగా పొట్టి క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు స్కై. అలాంటోడికి అరుదైన గౌరవం దక్కింది. తోపు క్రికెటర్లను కాదని.. సూర్యకుమార్‌కు ఓ గౌరవం లభించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. 2023 ఏడాదికి గానూ బెస్ట్ టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ టీమ్‌లో యశస్వి జైస్వాల్, సాల్ట్, నికోలస్ పూరన్, సూర్యకుమార్, చాప్మన్, సికందర్ రజా, రంజానీ, మార్క్ అడైర్‌తో పాటు రవి బిష్ణోయ్, గరవా, అర్ష్‌దీప్ సింగ్‌లు సభ్యులుగా ఉన్నారు. భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఈసారి చోటు దక్కించుకోవడం విశేషం. సూర్యతో పాటు జైస్వాల్, బిష్ణోయ్, అర్ష్‌దీప్ ఈ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. అయితే ఎందరో తోపు క్రికెటర్లు ఉన్నప్పటికీ టీ20 క్రికెట్లో గతేడాది దుమ్మురేపిన సూర్యకుమార్‌నే కెప్టెన్‌గా ఎంచుకుంది ఐసీసీ. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన సూర్య.. అటు బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు ఇటు సారథిగానూ ఆకట్టుకున్నాడు. అందుకే ఐసీసీ అతడ్ని కెప్టెన్‌గా నియమించిందని తెలుస్తోంది.
ఇక, సౌతాఫ్రికా సిరీస్‌లో గాయపడ్డ సూర్యకుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. ఇంజ్యురీ తర్వాత కొన్నాళ్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు స్కై. అయితే గాయం తగ్గకపోవడంతో జర్మనీకి వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్యకు డాక్టర్లు సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ కంప్లీట్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోలను మిస్టర్ 360 తన అభిమానులతో పంచుకున్నాడు.
ఆపరేషన్ విజయవంతమైందని.. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు సూర్య. త్వరలోనే అందరి ముందుకు వస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా ప్రకటించడంతో సూర్యతో పాటు అతడి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది సూర్య ప్రతిభకు దక్కిన గౌరవం అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతేడాది 18 టీ20లు ఆడిన సూర్య 43.1 స్ట్రయిక్ రేట్‌తో 733 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉండటం విశేషం. మరి.. ఐసీసీ టీ20 టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా ఎంపికవడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ICC T20i team of the year:
Jaiswal, Salt, Pooran (WK), Suryakumar Yadav (C), Chapman, Sikandar Raza, Ramjani, Mark Adair, Bishnoi, Ngarava and Arshdeep Singh. pic.twitter.com/7RBR8J9aPo
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024