iDreamPost
android-app
ios-app

Breaking: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్!

  • Published Aug 24, 2024 | 8:01 AM Updated Updated Aug 24, 2024 | 8:24 AM

Shikhar Dhawan Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Shikhar Dhawan Retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Breaking: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్!

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఇక ఇప్పటి వరకు తనకు మద్ధతు పలికిన అభిమానులకు, సహచర క్రికెటర్లకు నా ధన్యవాదాలు, దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియా తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇది తనకు లభించిన గొప్ప అవకాశం అని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు కోచింగ్ ఇచ్చిన కోచ్ లను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఇక ఇన్ని సంవత్సరాల తన కెరీర్ కు అండగా నిలిచిన అభిమానులకు, సహచర క్రికెటర్లకు నా థ్యాంక్స్ చెప్పాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో అనుభూతులను అందుకున్నానని, ఇందుకు కారణం అయిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ వీడియోలో పేర్కొన్నాడు. కాగా.. ఒక్కసారిగా ధావన్ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే.. గత కొంత కాలంగా ఇటు కెరీర్ పరంగా, అటు ఫ్యామిలీ పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ధావన్. భార్యతో విడాకుల తర్వాత కొడుకును తలచుకుంటూ మానసికంగా కుంగిపోయాడు. దానికితోడు జట్టులో చోటు కోల్పోవడం అతడిని మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ తీసుకున్న ఈ డెసిషన్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ధావన్ కెరీర్ విషయానికి వస్తే.. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ గా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి.. జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఇక తన సుదీర్ఘ కెరీర్ లో 34 టెస్టుల్లో 2315 రన్స్, 167 వన్డేల్లో 6793, 68 టీ20ల్లో 1759 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్ లో 222 మ్యాచ్ లు ఆడి 6768 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17, ఐపీఎల్ లో 2 శతకాలను నమోదు చేశాడు ఈ వెటరన్ ఓపెనర్. మరి ఇంత అర్ధాంతరంగా శిఖర్ ధావన్ కెరీర్ కు గుడ్ బై చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.