iDreamPost
android-app
ios-app

Maharaja Trophy 2024: టీ20 క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు!

  • Published Aug 24, 2024 | 7:42 AM Updated Updated Aug 24, 2024 | 7:42 AM

ప్రపంచ క్రికెట్ లో అద్భుతం చోటుచేసుకుంది. ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రపంచ క్రికెట్ లో అద్భుతం చోటుచేసుకుంది. ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Published Aug 24, 2024 | 7:42 AMUpdated Aug 24, 2024 | 7:42 AM
Maharaja Trophy 2024: టీ20 క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు!

ప్రపంచ క్రికెట్ లో అద్భుతం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరగని కనీవినీ సంఘటన టీ20 క్రికెట్ లో చోటుచేసుకుంది. అందుకు కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీ వేదికగా నిలిచింది. ఈ టోర్నీలో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. ఇలా జరగడం వరల్డ్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాజా ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్ వర్సెస్ బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు నమోదు అయ్యాయి. ముందు బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 రన్స్ చేసింది. జట్టులో కెప్టెన్ మనీష్ పాండే 33 రన్స్ తో రాణించాడు. అనంతరం 165 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బ్లాస్టర్స్ సరిగ్గా 164 పరుగులకే కుప్పకూలింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది. ఫలితంగా సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక తొలి సూపర్ ఓవర్ లో బెంగళూరు 10/1, హుబ్లీ 10/0 రన్స్ చేశాయి.

ఇక రెండో సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 8 పరుగులు చేశాయి. చేసేది ఏమీలేక మూడో సూపర్ ఓవర్ కు మ్యాచ్ వెళ్లింది. ఇందులో బెంగళూరు 12/1 రన్స్ చేయగా.. హుబ్లీ 13/1 పరుగులు చేసి విజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు మాత్రమే జరిగాయి. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఒకే మ్యాచ్ లో 3 సూపర్ ఓవర్లు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet