iDreamPost

పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్.. మ్యారేజ్ ఫొటోలు వైరల్!

  • Published Jun 02, 2024 | 12:55 PMUpdated Jun 02, 2024 | 1:08 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అతడి మ్యారేజ్​కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టీమిండియా స్టార్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అతడి మ్యారేజ్​కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన గర్ల్ ఫ్రెండ్ శృతి రంగనాథన్​ను వివాహమాడాడు అయ్యర్. కుటుంబీకులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇక, భారత్ తరఫున వెంకీ అయ్యర్ 9 టీ20లు, 2 వన్డే మ్యాచులు ఆడాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు అయ్యర్. ఈ సీజన్​లో అతడు బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు.

ఈ ఏడాది ఐపీఎల్​లో 15 మ్యాచుల్లో 158 స్ట్రైక్ రేట్​తో 370 పరుగులు చేశాడు వెంకీ అయ్యర్. చూడటానిక ఇవి కాస్త తక్కువ రన్స్​లాగే కనిపించినా.. కీలక సమయాల్లో మంచి నాక్స్ ఆడాడతను. ముఖ్యంగా ప్లేఆఫ్స్, ఫైనల్స్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ మీద తన విశ్వరూపం చూపించాడు. క్వాలిఫైయర్స్​-1లో 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఎస్​ఆర్​హెచ్​ నుంచి మ్యాచ్​ను లాగేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్​లో 26 బంతుల్లోనే 52 పరుగులతో మరో విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్​లో టీమ్​ను గెలుపు తీరాలను చేర్చడమే గాక కప్పును కూడా అందించాడు. అలాంటోడు తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్ జంటకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి