iDreamPost
android-app
ios-app

ICUలో టీమిండియా క్రికెటర్.. అందోళనలో అభిమానులు!

  • Published Jan 30, 2024 | 7:20 PM Updated Updated Jan 30, 2024 | 7:25 PM

ఒక టీమిండియా క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఒక టీమిండియా క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  • Published Jan 30, 2024 | 7:20 PMUpdated Jan 30, 2024 | 7:25 PM
ICUలో టీమిండియా క్రికెటర్.. అందోళనలో అభిమానులు!

క్రికెటర్లకు మన దేశంలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్​ను ఓ మతంలా భావించే భారత్​లో క్రికెటర్లను సూపర్​స్టార్స్​గా చూస్తారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలో అవుతుంటారు. తమ గేమ్​తో అందర్నీ అలరించే ప్లేయర్లను అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారికి ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఫ్యాన్స్ చాలా బాధపడతారు. ఇదిలా ఉంటే.. ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతగా ఉండటంతో అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. మయాంక్ అగర్వాల్.

స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆస్పత్రిలో చేరాడు. గొంతు, నోటి నొప్పి కారణంగా అతడ్ని హుటాహుటిన అగర్తలలోని ఐఎల్​ఎస్ హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అతడికేమీ ప్రమాదం లేదని తెలుస్తోంది. మయాంక్ సేఫ్​గా ఉన్నాడని సమాచారం. అయితే మయాంక్ హెల్త్ గురించి తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫుల్ ఫిట్​గా ఉండే క్రికెటర్ ఇలా ఐసీయూలో ఉండటం ఏంటని షాకవుతున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఇక, టీమిండియా తరఫున 21 టెస్టులు ఆడిన మయాంక్ అగర్వాల్ 1488 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 5 వన్డేల్లో 86 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 98 మ్యాచులు ఆడి 7430 పరుగులు చేశాడు.