iDreamPost
android-app
ios-app

వీడియో: వాంఖడే స్టేడియంలో రోహిత్, కోహ్లీ మాస్ డ్యాన్స్! ఇది కదా ఫ్యాన్స్ కోరుకున్నది..

  • Published Jul 05, 2024 | 7:30 AM Updated Updated Jul 05, 2024 | 7:30 AM

Virat Kohli, Rohit Sharma Mass Dance: టీమిండియా నామస్మరణతో వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక ఈ సన్మాన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వేసిన మాస్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Virat Kohli, Rohit Sharma Mass Dance: టీమిండియా నామస్మరణతో వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక ఈ సన్మాన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వేసిన మాస్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

  • Published Jul 05, 2024 | 7:30 AMUpdated Jul 05, 2024 | 7:30 AM
వీడియో: వాంఖడే స్టేడియంలో రోహిత్, కోహ్లీ మాస్ డ్యాన్స్! ఇది కదా ఫ్యాన్స్ కోరుకున్నది..

టీ20 వరల్డ్ కప్ తో భారత్ కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుంచి ప్రధాని మోదీని కలిసి, ముంబైకి చేరుకున్న ప్లేయర్లకు ఊహించని ఘన స్వాగతం లభించింది. ముంబై మెుత్తం జన సంద్రంగా మారింది. రోడ్లు మెుత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇక వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమంలో ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అద్భుతమైన స్పీచ్ తో అలరించిన రోహిత్, కోహ్లీలు అంతకంటే అద్భుతమైన మాస్ డ్యాన్స్ తో అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

13 ఏళ్ల తర్వాత టీమిండియా వరల్డ్ కప్ సాధించడంతో ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచ కప్ తో స్వదేశానికి వచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఫ్యాన్స్ నిరాజనాలు పలికారు. ముంబై వీధులు ఇండియా.. ఇండియా.. అనే నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇక వాంఖడే స్టేడియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సీన్స్ ఎన్నో జరిగాయి. అందులో ఒకటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి డ్యాన్స్ చేయడం.

టీమిండియా వరల్డ్ కప్ విజయోత్సవ యాత్ర అనంతరం వాంఖడే స్టేడియానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లో తిరుగుతూ.. అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో జట్టు సభ్యులతో కలిసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్ చేశారు. తమను తాము మరిచిపోయి.. చిన్న పిల్లల్లా డ్యాన్స్ చేశారు ఈ స్టార్ ప్లేయర్లు. వీరితో పాటుగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రోహిత్, కోహ్లీలు కలిసి డ్యాన్స్ వేయడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. దాంతో  ఇది కదా మేము(ఫ్యాన్స్) కోరుకునేది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీ, రోహిత్ మాస్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom