iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో టీమిండియా.. స్వదేశానికి తిరిగొచ్చేందుకు కష్టాలు!

  • Published Jul 01, 2024 | 11:57 AM Updated Updated Jul 01, 2024 | 11:57 AM

Team India players stuck in Barbados: టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని స్వదేశానికి రావాల్సిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంకా బార్బడోస్ లోనే ఉన్నారు. ప్లేయర్లు అక్కడ చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

Team India players stuck in Barbados: టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని స్వదేశానికి రావాల్సిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంకా బార్బడోస్ లోనే ఉన్నారు. ప్లేయర్లు అక్కడ చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

చిక్కుల్లో టీమిండియా.. స్వదేశానికి తిరిగొచ్చేందుకు కష్టాలు!

టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని తన 13 ఏళ్ల కలను నెరవేర్చుకున్న టీమిండియా.. ప్రస్తుతం వెస్టిండీస్ లో కష్టాలు ఎదుర్కొంటోంది. వరల్డ్ కప్ ను తీసుకుని స్వదేశానికి రావాల్సిన టీమిండియా ప్లేయర్లు ఇంకా వెస్టిండీస్ లోనే ఉన్నారు. వారు అక్కడ చిక్కుకుపోయారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు జూలై 1 ఉదయం 11 గంటల కల్లా ఇండియాలో ల్యాండ్ కావాల్సింది. కానీ అలా జరగలేదు. అసలేం జరిగింది? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న అనంతరం ట్రోఫీతో సహా భారత్ లో అడుగుపెట్టాల్సిన టీమిండియా ఆటగాళ్లు ఇంకా వెస్టిండీస్ లోనే ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన బార్బడోస్ నగరంలోనే ప్లేయర్లు ఉన్నారు. వారు అక్కడ చిక్కుకుపోయారు. అసలు విషయం ఏంటంటే? అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ‘బెరిల్’ హరికేన్ కారణంగా బార్బడోస్ లో విమాన సర్వీస్ లను రద్దు చేశారు. దాంతో టీమిండియా బృందం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ తుఫాన్ ప్రభావం తగ్గి.. విమాన సర్వీస్ లు నడిస్తే.. రేపటి వరకు(జూలై 2) టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటారు.

కాగా.. ప్రస్తుతం టీమిండియా బార్బడోస్ లోని హిల్టన్ లో బస చేస్తోంది. భారత రూట్ మ్యాచ్ ఎలా ఉందంటే?  బార్బడోస్ నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కానీ బెరిల్ హరికేన్ టీమిండియా ప్లాన్ ను దెబ్బతీసింది. తుఫాన్ తగ్గి.. విమాన సర్వీస్ లు పునరుద్ధరింపబడితేనే భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటారు. ఇక ఛాంపియన్స్ రాకకోసం భారత ప్రభుత్వంతో పాటుగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పోరాట యోధులకు ఘన స్వాగతం పలకాలని ప్రణాళికలు రచిస్తున్నారు.