iDreamPost
android-app
ios-app

సూర్యకుమార్ క్యాచ్ పై వివాదం.. దక్షిణాఫ్రికా లెజెండ్ ఏమన్నాడంటే?

  • Published Jul 01, 2024 | 10:48 AM Updated Updated Jul 01, 2024 | 10:48 AM

Suryakumar Yadav Controversial Catch: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్యాచ్ పై సౌతాఫ్రికా లెజెండ్ స్పందించాడు. అతడు ఏమన్నాడంటే?

Suryakumar Yadav Controversial Catch: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్యాచ్ పై సౌతాఫ్రికా లెజెండ్ స్పందించాడు. అతడు ఏమన్నాడంటే?

సూర్యకుమార్ క్యాచ్ పై వివాదం.. దక్షిణాఫ్రికా లెజెండ్ ఏమన్నాడంటే?

సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాడు. దానికి కారణం మనందరికి తెలిసిందే. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను సిక్సర్ వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా.. సూపర్ మెన్ విన్యాసంతో అతడిని ఔట్ చేశాడు. దాంతో టీమిండియా విజయం ఖాయం అయ్యింది. అయితే ఈ స్టన్నింగ్ క్యాచ్ పై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కొందరు సూర్య బౌండరీలైన్ తాకాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం అది అద్భుతమైన క్యాచ్ అంటూ కితాబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద క్యాచ్ పై సౌతాఫ్రికా లెజెండ్ షాన్ పొల్లాక్ స్పందించాడు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను సిక్సర్ వెళ్లకుండా అడ్డుకుని.. కళ్లు చెదిరే క్యాచ్ ను అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. ఈ క్యాచ్ గనక సూర్య వదిలేసి ఉంటే.. టీమిండియా వరల్డ్ కప్ గెలిచేది కాదు. అయితే ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకునే క్రమంలో స్కై బౌండరీలైన్ ను తాకాడని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం అది కరెక్ట్ క్యాచే అంటూ సూర్యకు మద్ధతు తెలుపుతున్నారు. ఇక ఈ వివాదాస్పద క్యాచ్ పై స్పందించాడు సౌతాఫ్రికా దిగ్గజం షాన్ పొల్లాక్.

“సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ పై గత రెండు రోజులుగా తీవ్రమైన చర్చనడుస్తోంది. ఈ క్యాచ్ పై ఇంత రాద్ధాంతం అవసరం లేదు. సూర్యకుమార్ అద్భుతంగా ఆ క్యాచ్ ను అందుకున్నాడు. బౌండరీ లైన్ కు స్కై తాకలేదు, అతడు దానిపై నిలబడలేదు. సూర్య తనను తాను నిలవరించుకున్న తీరు అమోఘం. ఈ నైపుణ్యాలు అందరికీ ఉండవు. దీనిపై చర్చ అనవసరం” అంటూ పొల్లాక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా లెజెండ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.