సాధారణంగా క్రికెట్ మ్యాచ్ కు ఆటగాళ్లు లేట్ అవ్వడం అన్నది ఏ గల్లీ క్రికెట్ లోనో లేదా మామూలు టోర్నీల్లోనో జరుగుతుంది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో ఓ ఆటగాడు మ్యాచ్ కు లేట్ గా రావడం అన్నది జరగడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ఇలాంటి అసాధ్యమైన సంఘటన ఇండియా-పాక్ మ్యాచ్ లో జరిగింది. అవును మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఈ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఓ భారత ఆటగాడు తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. మందులు వాడినప్పటికీ అతడు కోలుకోలేదు. దీంతో వేరే ప్లేయర్ కు పిలుపు వెళ్లింది. కానీ అతడు వేరే నగరంలో ఉన్నాడు. అతడు మ్యాచ్ కు లేట్ గా రావడంతో.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చిన ఏకైక క్రికెటర్ గా ఈ టీమిండియా బ్యాటర్ నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చిన ఏకైక ఆటగాడిగా భారత మాజీ ప్లేయర్ సందీప్ పాటిల్ నిలిచాడు. ఈ అనుకోని సంఘటన 1983లో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 1983లో నాగపూర్ వేదికగా ఇండియా-పాక్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ జరిగింది. తొలి రెండు టెస్ట్ లు డ్రాగా ముగియడంతో.. ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాడు మెుహిందర్ అమర్ నాథ్ అనారోగ్యం బారినపడ్డాడు. మందులు వాడినప్పటికీ అతడు ఫిట్ గా లేడు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లోనే సందీప్ పాటిల్ ను బరిలోకి దింపాలని సెలక్టర్లు భావించి అతడికి పిలుపిచ్చారు. కానీ అతడు జట్టుతో లేడు. వేరే నగరంలో ఉన్నాడు.
ఇక అతడిని తీసుకువచ్చేందుకు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పాటిల్ కుటుంబం అతడి క్రికెట్ కిట్ ను ఎయిర్ పోర్ట్ కు పంపింది. దీంతో అతడు హుటాహుటిన మ్యాచ్ కు బయలుదేరాడు. అయితే అదృష్టవశాత్తు వర్షం కారణంగా ఆట ఆలస్యం అయ్యింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? టాస్ వేసే సమయానికి సందీప్ పాటిల్ విమానంలోనే ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. సెలెక్టర్ల చిన్న తప్పు వల్ల అంతర్జాతీయ మ్యాచ్ కు ఆలస్యంగా చేరుకున్న ఆటగాడిగా సందీప్ పాటిల్ నిలిచాడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.