Nidhan
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ స్టైలిష్ బ్యాటర్ ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ స్టైలిష్ బ్యాటర్ ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు.
Nidhan
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పుడు నిరాశలో ఉన్నాడు. గాయంతో కొన్నాళ్లు జట్టుకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్ గతేడాది ఆసియా కప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నమెంట్లో అదరగొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాణించాడు. ఈ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లోనూ బ్యాట్‌తో దుమ్మురేపాడు రాహుల్. రీసెంట్గా ముగిసిన సౌతాఫ్రికా టూర్లోనూ తన తడాఖా చూపించాడు. టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీతో మెరిశాడు. ఆ సిరీస్‌లో శతకం బాదిన ఏకైక భారత క్రికెటర్ రాహులే. అందరూ ఫెయిలైనా అతడు క్రీజులో పట్టుదలతో నిలబడి ఆడాడు. గత కొన్ని నెలలుగా కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్న ఈ బ్యాటర్.. కీపింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలాంటి రాహుల్‌కు మరో షాకింగ్ న్యూస్. అతడ్ని వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయిందని తెలుస్తోంది.
కేఎల్ రాహుల్‌కు వరుస షాక్‌లు ఇస్తోంది భారత టీమ్ మేనేజ్మెంట్. ఇవాళ నుంచి స్టార్ట్ కానున్న ఆఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయని విషయం తెలిసిందే. రాహుల్‌కు రెస్ట్ ఇచ్చారా? విస్మరించారా? అనే విషయంపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాడు. కానీ రాహుల్ గురించి ఏ విషయమూ చెప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలసి గత టీ20 వరల్డ్ కప్‌లోనే ఆఖరి పొట్టి ఫార్మాట్ మ్యాచ్ ఆడాడు రాహుల్. హిట్‌మ్యాన్, విరాట్ ఆఫ్ఘాన్ సిరీస్‌తో టీ20ల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. కానీ రాహుల్‌కు మాత్రం నిరాశే మిగిలింది. టీ20లకు పక్కన పెట్టి షాకిచ్చిన బీసీసీఐ.. టెస్టుల్లో అతడ్ని వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు రాహుల్ ఇటీవలే ప్రకటించాడు. ఏ పొజిషన్లో ఆడేందుకైనా తాను రెడీగా ఉన్నానని.. జట్టులో చోటు ఇస్తే చాలన్నాడు. అయితే భారత మేనేజ్మెంట్ మాత్రం రాహుల్‌ను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే పరిగణిస్తున్నట్లు సమాచారం. జనవరి 25వ తేదీ నుంచి మొదలుకానున్న ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లోనూ రాహుల్‌ను బ్యాటర్‌గానే సెలక్ట్ చేయనున్నారట. వికెట్ కీపింగ్ బాధ్యతల్ని తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు అప్పజెప్పడం మీద సమాలోచనలు చేస్తున్నారని టాక్. దీంతో రాహుల్ ఫ్యాన్స్ టీమిండియా మేనేజ్మెంట్ మీద సీరియస్ అవుతున్నారు. టాలెంటెడ్ ప్లేయర్ కెరీర్‌తో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే రీసెంట్గా రాహుల్ వెన్నెముక సర్జరీ చేయించుకున్నాడని.. అతడిపై వర్క్ లోడ్‌ను తగ్గించే ఉద్దేశంతోనే కీపింగ్ నుంచి తొలగించాలని నిర్ణయించారని సమాచారం. మరి.. రాహుల్‌ను వికెట్ కీపింగ్ బాధ్యతల తొలగించనున్నారనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్ కు నో ఛాన్స్.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!
The team management aims to relieve KL Rahul from dual responsibilities of wicket-keeping and batting, considering his recent back surgery 🇮🇳🏏#BCCI #IndianCricketTeam #INDvsENG #KLRahul #CricketTwitter pic.twitter.com/S10Faz6kUY
— InsideSport (@InsideSportIND) January 11, 2024