Nidhan
టీమిండియా లెజెండ్ జహీర్ ఖాన్ పదునైన పేస్ బౌలింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు. భారత్ నుంచి వచ్చిన అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా నిలిచిన జహీర్.. ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని చాలా మందికి తెలియదు.
టీమిండియా లెజెండ్ జహీర్ ఖాన్ పదునైన పేస్ బౌలింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు. భారత్ నుంచి వచ్చిన అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా నిలిచిన జహీర్.. ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని చాలా మందికి తెలియదు.
Nidhan
జహీర్ ఖాన్.. క్రికెట్ వరల్డ్‌కు టీమిండియా అందించిన ఓ పేస్ బౌలింగ్ ఆణిముత్యం. స్పిన్నర్ల కార్ఖానాగా పేరు తెచ్చుకున్న భారత్ నుంచి వచ్చిన ఒక నిఖార్సైన ఫాస్ట్ బౌలర్. కత్తి చేత పట్టిన యోధుడిలా బాల్ అందుకొని పిచ్ మీదకు దూకే జహీర్‌ను చూసి ఎంతటి బ్యాటర్లు అయినా వణికిపోయేవారు. అతడి రివర్స్ స్వింగ్‌కు మహామహా బ్యాట్స్‌మన్ కూడా పోసుకునేవారు. స్వింగ్ డెలివరీస్‌తో పాటు డెడ్లీ యార్కర్స్, షార్ప్ బౌన్సర్స్, స్లో డెలివరీస్‌తో టాప్ ప్లేయర్లతో కూడా ఆడుకునేవాడు జహీర్. 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడతను. 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు టీమిండియా కంటే ముందు ఆస్ట్రేలియాకు ఆడాడని మీకు తెలుసా?
జహీర్ ఖాన్ టీమిండియా తరఫున వందలాది మ్యాచుల్లో ఆడి బోలెడు వికెట్లు తీశాడు. ఎన్నో మ్యాచుల్లో తన బౌలింగ్ టాలెంట్‌తో జట్టుకు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్.. ఇలా టాప్ టీమ్స్ అన్నింటినీ పదునైన బౌలింగ్‌తో భయపెట్టాడు. అయితే భారత్‌కు ఇన్ని సేవలు అందించిన జహీర్ మాతృదేశానికి ఆడటానికి ముందే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. ఐపీఎల్-2024 మ్యాచులకు కామెంట్రీ ఇస్తున్న జహీర్ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్ కామెంట్రీలో భాగంగా జహీర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. జహీర్ ఫస్ట్ ఆస్ట్రేలియాకు ఆడాడని చాలా మందికి తెలియదని స్టైరిస్ అన్నాడు. ఆసీస్-న్యూజిలాండ్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడాడని చెప్పాడు. దీంతో షాకైన జహీర్.. అవును? అది నీకు గుర్తుందా? అని ప్రశ్నించాడు. ఆసీస్ తరఫున తాను ఆడింది నిజమేనని భారత దిగ్గజ పేసర్ అన్నాడు. అప్పట్లో తాను ప్రాక్టీస్ చేసే అకాడమీ అడిలైడ్‌లో ఉండేదని.. ఆ తర్వాత బ్రిస్బేన్‌కు మార్చారని తెలిపాడు. ఆ టూర్లో మైకేల్ క్లార్క్ కూడా ఆసీస్ టీమ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. తాను కూడా ఆ జట్టులో ఆడానని.. క్లార్క్ తన టీమ్మేట్ అని జహీర్ స్పష్టం చేశాడు. ఆసీస్‌కు ఆడటం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇది తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.