iDreamPost
android-app
ios-app

MS Dhoni: ఆ సీక్రెట్ చెబితే CSKలో నుంచి పీకేస్తారు! ధోని షాకింగ్ కామెంట్స్

  • Published Feb 12, 2024 | 3:21 PM Updated Updated Feb 12, 2024 | 3:21 PM

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తే తనను జట్టులో నుంచి పీకేస్తారని అన్నాడు. అసలు మాహీ చెప్పకుండా దాస్తున్న ఆ రహస్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తే తనను జట్టులో నుంచి పీకేస్తారని అన్నాడు. అసలు మాహీ చెప్పకుండా దాస్తున్న ఆ రహస్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 12, 2024 | 3:21 PMUpdated Feb 12, 2024 | 3:21 PM
MS Dhoni: ఆ సీక్రెట్ చెబితే CSKలో నుంచి పీకేస్తారు! ధోని షాకింగ్ కామెంట్స్

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని, చేతులకు గ్లవ్స్ వేసుకొని, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని గ్రౌండ్​లోకి దిగాడు. ఇంకో నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుండటంతో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్​లో లోక్​సభ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తేదీలు ఖరారు కానప్పటికీ టోర్నీ జరగడం కన్ఫర్మ్ కాబట్టి ధోని ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. ఈసారి మైదానంలో దిగి తన బ్యాట్ పవర్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. కెప్టెన్​గా ఎలాగూ సక్సెస్ అవుతున్న మాహీ.. బ్యాటింగ్​లోనూ మెరుపులు మెరిపించాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు సక్సెస్ సీక్రెట్ చెప్పేందుకు నిరాకరించాడు. ఆ రహస్యం ఏంటో చెబితే తన జాబ్ పోతుందన్నాడు.

సీఎస్​కే సక్సెస్ సీక్రెట్ ఏంటని ఓ ప్రోగ్రామ్​లో ధోనీకి ప్రశ్న ఎదురైంది. షేన్ వాట్సన్, అజింక్యా రహానె లాంటి ఎందరో ప్లేయర్లు అంతకుముందు ఇతర జట్లకు ఆడినప్పుడు నిరాశపరిచినా.. చెన్నైలోకి వచ్చాక మాత్రం అదరగొడుతుంటారు? దీని వెనుక రహస్యం ఏంటని మాహీని అడిగారు. దీనికి ధోని తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్​లో నుంచి తనను పీకేస్తారని అన్నాడు. ఎప్పటికీ ఆ రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోబోనని స్పష్టం చేశాడు. ‘ఆ సీక్రెట్ ఏంటో చెబితే నన్ను ఎవరూ తీసుకోరు. కాబట్టి ఆ రహస్యాన్ని అలాగే తెలియకుండా ఉంచేస్తా. బడా కోలా కంపెనీల మాదిరిగా ఆ సీక్రెట్​ను రివీల్ చేయబోను. వాళ్లు తమ రెసిపీ ఏంటో పబ్లిక్​గా చెప్పరు. నేను కూడా అంతే’ అని ధోని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్​లో తాను వేసుకొనే ఐకానిక్ జెర్సీ నంబర్ 7 గురించి కూడా ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో దాచేదేమీ లేదని.. జులై 7వ తేదీన తన బర్త్ డే అని, అందుకే ఆ నంబర్ టీ షర్ట్ వేసుకుంటానని అన్నాడు. ఇక, కెప్టెన్​గా చెన్నై సూపర్ కింగ్స్​ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు ధోని. ఆ టీమ్​కు ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇచ్చినా ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. క్యాష్ రిచ్​ లీగ్​కూ గుడ్​బై చెబుతాడని మూడేళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయినా ఆడటం ఆపని మాహీ.. లాస్ట్ సీజన్​లో సీఎస్​కేను ఛాంపియన్​ను చేశాడు. కాలి నొప్పి ఇబ్బంది పెడుతున్నా మొండిగా ఆడాడు. టీమ్​లో స్టార్లు లేకపోయినా ఉన్న వారిలో నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను రాబట్టాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్​కేలోకి వచ్చే ప్లేయర్లు అంతగా ఎందుకు సక్సెస్ అవుతున్నారని అతడికి ప్రశ్న ఎదురైంది. మరి.. కెప్టెన్​గా ధోని సక్సెస్ సీక్రెట్ ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: U19 World Cup 2024: వీడియో: ఫైనల్లో భారత ప్లేయర్ల సందడి.. గ్రౌండ్​లో తెలుగులో మాట్లాడుతూ..!