Nidhan
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడనేది తెలిసిందే. కోచ్ పోస్ట్ కోసం బీసీసీఐ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ తరుణంలో ఆ పదవిపై ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడనేది తెలిసిందే. కోచ్ పోస్ట్ కోసం బీసీసీఐ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ తరుణంలో ఆ పదవిపై ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరొస్తారనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ పోస్ట్‌లో కొనసాగనని చెప్పడంతో కొత్త కోచ్ కోసం అన్వేషించసాగింది భారత క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ రేసులో భారత లెజెండ్ గౌతం గంభీర్ సహా ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్లు బలంగా వినిపించాయి. వీరిలో ఏ ఒక్కరు కూడా ఆ పోస్ట్‌కు అప్లై చేసుకోలేదని వార్తలు వస్తున్నాయి. మిగతా వారి కంటే గంభీర్ వైపే బీసీసీఐ ఎక్కువగా మొగ్గు చూపిస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్-2024 ఫైనల్ ముగిశాక గౌతీతో బోర్డు సెక్రెటరీ జైషా సుదీర్ఘంగా చర్చలు జరపడం దీనికి ఊతమిస్తోంది. ఈ తరుణంలో ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత హెడ్ కోచ్ పదవిలో కొనసాగడంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు ద్రవిడ్. ఈ టీ20 వరల్డ్ కప్-2024 తనకు ఆఖరిదంటూ ఒక్క మాటతో తేల్చేశాడు. టీమిండియాకు ఉండే టైట్ షెడ్యూల్స్ వల్ల వ్యక్తిగతంగా తనకు తీరిక కుదరట్లేదని, ఈ పోస్ట్‌కు మళ్లీ అప్లై చేయలేనని కరాఖండీగా చెప్పేశాడు. ఈ మెగా టోర్నీతో తన పదవి ముగిసిపోతుందని స్పష్టం చేశాడు. కోచ్ పదవిని తాను ఎంతో ప్రేమించానని, ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు. ఇది చాలా స్పెషల్ జాబ్ అని.. భారత ఆటగాళ్లతో కలసి పని చేయడం అద్భుతమని వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్ ముఖ్యమనే భావనతో ఇన్నాళ్లూ టీమ్‌ను గైడ్ చేస్తూ వచ్చానని.. కాంపిటీటివ్ క్రికెట్లో ఇలాగే ఉండాలన్నాడు ద్రవిడ్. కోచ్ పదవితో పాటు మరికొన్ని విషయాల మీద కూడా ద్రవిడ్ రియాక్ట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎదుర్కొనే సవాళ్ల గురించి మాట్లాడాడు.
గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్‌తో మ్యాచ్ కూడా చాలా కీలకమని ద్రవిడ్ తెలిపాడు. ఏ మ్యాచ్‌నూ లైట్ తీసుకోమని స్పష్టం చేశాడు. ఇటీవల పాక్‌ను ఐర్లాండ్ చిత్తు చేసిందని.. ఆ టీమ్‌ను తక్కువ అంచనా వేయడం లేదని చెప్పాడు. కాగా, నవంబర్ 2021లో కోచింగ్ బాధ్యతలు తీసుకున్న ది వాల్.. వన్డే ప్రపంచ కప్-2023 తర్వాత వైదొలగాల్సింది. అయితే పొట్టి కప్పుకు అట్టే టైమ్ లేకపోవడంతో అప్పటిదాకా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో కంటిన్యూ అవుతూ వచ్చాడు ద్రవిడ్. ఇంకొన్నాళ్లు టీమ్‌ను వెనుక ఉండి నడిపించమని తాజాగా బోర్డు రిక్వెస్ట్ చేసినా ఆయన వద్దన్నాడు. ఇప్పుడు స్వయంగా ద్రవిడే తనకు ఇది ఆఖరి టోర్నీ అని చెప్పడం, కోచ్ పోస్ట్‌కు దరఖాస్తు చేయనని అనడంతో కొత్త కోచ్‌గా మరో వ్యక్తి రాక ఖాయమైంది.
RAHUL DRAVID CONFIRMS T20 WORLD CUP 2024 IS HIS LAST COMMITMENT AS INDIA’S HEAD COACH. (Vimal Kumar). pic.twitter.com/cc38dIUqF7
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2024