Nidhan
టీమిండియాకు నయా ధోని దొరికాడని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పాడు. అశ్విన్ చెప్పిన ఆ మరో ధోని ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియాకు నయా ధోని దొరికాడని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పాడు. అశ్విన్ చెప్పిన ఆ మరో ధోని ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ టీమిండియాకు చాలా విధాలుగా ఉపయోగపడింది. చిన్న జట్టుతో సిరీస్ కదా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ముందు చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆఫ్ఘాన్‌తో సిరీస్ వల్ల టీ20 వరల్డ్ కప్-2024కు వెళ్లే టీమ్ సెలక్షన్, కాంబినేషన్ విషయంలో కొంతమేర క్లారిటీ వచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి పీకేయడంతో తీవ్ర నిరాశలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మలో జోష్ నింపింది ఈ సిరీస్. చివరి మ్యాచ్‌లో మెరుపు సెంచరీ, సూపర్ ఓవరల్లో తెలివిగా వ్యవహరించి గెలిపించడంతో సూపర్ పాజిటివ్‌గా ఉన్నాడతను. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా తనపై డౌట్స్ వద్దని చెప్పకనే చెప్పాడు హిట్‌మ్యాన్. శివమ్ దూబె, రింకూ సింగ్ రూపంలో మరో రెండు బిగ్ పాజిటివ్స్ కూడా ఈ సిరీస్‌తో దక్కాయి. వీళ్లు మ్యాచ్‌లు ఫినిష్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు నయా ధోని దొరికాడని చెప్పాడు.
రింకూ రూపంలో భారత జట్టుకు మరో ధోని దొరికాడన్నాడు అశ్విన్. అతడి ఆటతీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. ఇక ఫ్యూచర్ విషయంలో టీమిండియాకు ఢోకా లేదన్నాడు. ‘రింకూను నేను లెఫ్టాంటెడ్ ధోని అని పిలుస్తాను. మాహీ భాయ్‌తో అతడ్ని పోల్చలేను. ఎందుకంటే ధోని తన కెరీర్లో ఎంతో సాధించాడు. అయితే మాహీలా కూల్‌గా, కంపోజర్‌గా ఉంటాడు రింకూ. సంయమనం, ఓపికను ప్రదర్శిస్తూనే అవసరాన్ని బట్టి అటాకింగ్‌కు దిగుతాడు. అతడు ఉత్తర్ ప్రదేశ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్లో కంటిన్యూస్‌గా రన్స్ చేశాడు. దాన్నే టీమిండియాకు ఆడుతూ కొనసాగిస్తున్నాడు. అతడు యూపీ తరఫున ఆడినప్పుడు చాలా కష్టపడ్డాడు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా రాణించగలనని, టీమ్‌ను గెలపించగలనని అప్పుడే ప్రూవ్ చేశాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. యూపీ తరఫున సూపర్బ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియాలో ఆడే సత్తా తనకు ఉందని రింకూ నిరూపించాడని తెలిపాడు.
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రింకూ ఆడటం మీదా అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. చాలా ఏళ్ల పాటు కేకేఆర్ టీమ్‌లో అతడికి చోటు దక్కలేదన్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల పాటు అతడు బెంచ్ మీద కూర్చున్నాడని తెలిపాడు. ‘కేకేఆర్‌కు ఆడేటప్పుడు రింకూ చాలా ఏళ్ల పాటు బెంచ్ మీదే ఉన్నాడు. అతడికి ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా దక్కలేదని నాతో చాలా మంది చెప్పారు. త్రోడౌన్స్ సమయంలో బ్యాటర్లు కొట్టే బంతుల్ని అతడు కలెక్ట్ చేసి తీసుకొచ్చి బౌలర్లకు ఇచ్చేవాడు. అలా చాలా ఏళ్ల పాటు కేకేఆర్‌తో అతడు తన జర్నీని కొనసాగించాడు. కానీ యూపీ తరఫున బాగా ఆడటంతో అతడికి అవకాశాలు దక్కాయి. కఠిన సమయాల్లో కూల్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేయడం అతడి బలం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్ అయినా సరే రింకూ ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి.. రింకూనే మరో ధోని అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి:
Tilak Varma: సెంచరీతో చెలరేగిన తెలుగు కుర్రాడు తిలక్! ఇక టెస్ట్‌లోకి ఎంట్రీ ఫిక్స్?
Rohit Sharma: రోహిత్ వికెట్ కీపింగ్ చేస్తాడని తెలుసా? కానీ, ఎందుకు కొనసాగించలేదంటే?
Ravi Ashwin said, “Rinku Singh is somebody I’d call a left-handed MS Dhoni. I can’t compare him to MS just yet because MS is too big. But, I am talking about the composure that he brings. He has been consistently scoring buckets of runs and broke his way into the Indian team”. pic.twitter.com/c4EeCGFTmT
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 19, 2024