ఎప్పుడూ వివాదాలతో దోస్తీ కట్టే శ్రీశాంత్ పై తాజాగా ఓ చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఎప్పుడూ వివాదాలతో దోస్తీ కట్టే శ్రీశాంత్ పై తాజాగా ఓ చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
శ్రీశాంత్.. టీమిండియా క్రికెట్ లోకి ఎంతో వేగంగా దూసుకొచ్చిన ఈ స్టార్ పేసర్, బౌలింగ్ తోనే కాకుండా తన యాటిట్యూడ్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ నుంచి నిషేధానికి గురైయ్యాడు. ఇక ఎప్పుడూ వివాదాలతో దోస్తీ కట్టే శ్రీశాంత్.. సినిమా ఇండస్ట్రీలోకి కూడా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ కాసేపు పక్కనపెడితే.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ పై తాజాగా ఓ చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ లో ఎక్కువ వివాదాల్లో చిక్కుకున్న ఆటగాడు ఎవరంటే? చాలా మందికి టీమిండియా మాజీ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ శ్రీశాంతే గుర్తుకు వస్తాడు అనుకుంటా. అంతలా అతడు వివాదాలతో వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా మరో వివాదంతో న్యూస్ లో నిలిచాడు ఈ మాజీ ప్లేయర్. కేరళలోని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు విషయం ఏంటంటే? కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరులో క్రికెట్ అకాడమీ నిర్మిస్తామని చెప్పి శ్రీశాంత్ తో పాటుగా రాజీవ్ కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులు తన వద్ద నుంచి రూ. 18.70 లక్షలు తీసుకున్నారని చుండా ప్రాంతానికి చెందిన సరీష్ గోపాలన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
స్పోర్ట్స్ అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతో.. తాను పెట్టుబడి పెట్టినట్లుగా బాధితుడు తెలిపాడు. అయితే వారు తనను మోసం చేశారని ఆరోపిస్తూ.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై శ్రీశాంత్ తో పాటుగా ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో శ్రీశాంత్ ను ఏ3గా చేర్చినట్లు వారు పేర్కొన్నారు. కాగా.. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ నుంచి నిషేధం అయిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేశాడు ఈ స్పీడ్ స్టర్. ఇటు బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు శ్రీశాంత్. మరి టీమిండియా మాజీ క్రికెటర్ పై చీటింగ్ కేసు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cricketer S Sreesanth booked in cheating case
READ: https://t.co/qfABIoqCe0 pic.twitter.com/aDT9SN9bLU
— TOI Sports (@toisports) November 23, 2023