iDreamPost
android-app
ios-app

జవగళ్ శ్రీనాథ్ అద్భుతమైన డెలివరీకి 32 ఏళ్లు.. అక్రమ్, మెక్​గ్రాత్​లూ షాకయ్యేలా..!

  • Author singhj Published - 10:03 AM, Thu - 7 December 23

టీమిండియా లెజెండరీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వేసిన ఓ అద్భుతమైన డెలివరీకి 32 ఏళ్లు పూర్తయ్యాయి. పేస్​ బౌలింగ్​ గ్రేట్స్​గా పేరు తెచ్చుకున్న వసీం అక్రమ్, గ్లెన్ మెక్​గ్రాత్ కూడా ఆ బాల్​ను చూస్తే షాకవ్వాల్సిందే.

టీమిండియా లెజెండరీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వేసిన ఓ అద్భుతమైన డెలివరీకి 32 ఏళ్లు పూర్తయ్యాయి. పేస్​ బౌలింగ్​ గ్రేట్స్​గా పేరు తెచ్చుకున్న వసీం అక్రమ్, గ్లెన్ మెక్​గ్రాత్ కూడా ఆ బాల్​ను చూస్తే షాకవ్వాల్సిందే.

  • Author singhj Published - 10:03 AM, Thu - 7 December 23
జవగళ్ శ్రీనాథ్ అద్భుతమైన డెలివరీకి 32 ఏళ్లు.. అక్రమ్, మెక్​గ్రాత్​లూ షాకయ్యేలా..!

90వ దశకం ఆరంభం అది. భారత టీమ్ నిండా స్టార్ బ్యాటర్లు ఉండేవారు. కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ప్రవీణ్​ ఆమ్రే, సంజయ్ మంజ్రేకర్ ఇలా బ్యాటింగ్ సూపర్​స్టార్లతో జట్టు నిండిపోయింది. టార్గెట్ సెట్ చేయాలన్నా, భారీ స్కోర్లు ఛేజ్ చేయాలన్నా టీమిండియాకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ బౌలింగ్​లో మాత్రం మనకు ఎక్కువగా ఆప్షన్స్ ఉండేవి కాదు. కపిల్ దేవ్ కెరీర్​ ఆఖరి రోజులవి. ఆయనకు తోడుగా విజృంభించి బౌలింగ్ చేసేవాళ్లు, ప్రత్యర్థులను భయపెట్టేవారు టీమ్​లో లేరు. అటు పాకిస్థాన్​లో వసీం అక్రమ్, వకార్ యూనిస్.. వెస్టిండీస్​లో కర్ట్​లీ ఆంబ్రోస్, మాల్కమ్ మార్షల్ లాంటి భీకర పేసర్లు ఉండేవారు.

ఆస్ట్రేలియాలో గ్లెన్ మెక్​గ్రాత్ లాంటి అద్భుతమైన స్కిల్స్ ఉన్న స్పీడ్​స్టర్ ఉండేవాడు. సరిగ్గా అదే టైమ్​లో ఇండియన్ క్రికెట్​లోకి తారాజువ్వలా దూసుకొచ్చాడో యంగ్​స్టర్. అతడే జవగళ్ శ్రీనాథ్. భారత జట్టు పేస్ బౌలింగ్ కష్టాలను తీర్చేందుకు తానున్నానంటూ నిలబడ్డాడు. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో వరల్డ్ క్రికెట్​లో తన మార్క్​ను చూపించిన భారత పేసర్ అంటే జవగళ్ శ్రీనాథ్ అనే చెప్పాలి. శ్రీనాథ్ తర్వాత వెంకటేష్ ప్రసాద్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి ప్రతిభ కలిగిన వాళ్లు చాలా మందే వచ్చారు. కానీ శ్రీనాథ్​కు ఉన్న క్రేజ్, స్టార్​డమ్​ వేరు అనే చెప్పాలి.

పదునైన పేస్ బౌలింగ్, స్వింగ్, సీమింగ్ డెలివరీస్​తో వరల్డ్ బెస్ట్ బ్యాటర్స్​ను కూడా పోయించాడు శ్రీనాథ్. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ రైటార్మ్ పేసర్ దశాబ్ద కాలానికి పైనే భారత జట్టుకు సేవలు అందించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో 1991 అక్టోబర్​ 18న జరిగిన వన్డే మ్యాచ్​తో ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చాడు శ్రీనాథ్. అదే ఏడాది నవంబర్ 29న ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్​తో టెస్టు క్రికెట్​ ఆడటం స్టార్ట్ చేశాడు. 2003లో అదే ఆసీస్ మీద వాండరర్స్ స్టేడియంలో ఆడిన మ్యాచే ఆయన కెరీర్​లో ఆఖరుది. మొత్తంగా 12 ఏళ్ల కెరీర్​లో 67 టెస్టులు ఆడి 236 వికెట్లు తీశాడు. అదే టైమ్​లో 229 వన్డేలు ఆడి 315 వికెట్లు పడగొట్టాడు.

వన్డే వరల్డ్ కప్స్​లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో శ్రీనాథ్ (44) ముందు ఉండేవాడు. రీసెంట్​గా ముగిసిన ప్రపంచ కప్​లో మహ్మద్ షమి (45) ఆయన రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా తరఫున ఆడిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు గడించిన శ్రీనాథ్.. రిటైరైన మూడేళ్ల తర్వాత 2006లో ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్​ మ్యాచ్ రిఫరీలో మెంబర్​గా సెలక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 17 ఏళ్లలో పలు ప్రపంచ కప్​లతో పాటు ఎన్నో ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు. 250కు పైగా వన్డేల్లో మ్యాచ్ రిఫరీగా ఉన్న నాలుగో వ్యక్తిగానూ ఆయన రికార్డు సృష్టించాడు. అలాంటి జవగళ్ శ్రీనాథ్ 1991లో వెస్టిండీస్​తో జరిగిన ఓ మ్యాచ్​లో వేసిన ఒక డెలివరీకి 32 ఏళ్లు పూర్తయ్యాయి.

కీత్ అథర్టన్ అనే కరీబియన్ బ్యాటర్​ను శ్రీనాథ్ ఔట్ చేసిన విధానాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. లెఫ్టాండర్ అయిన అథర్ట్​న్​కు లెగ్ స్టంప్ మీద బాల్ వేశాడు శ్రీనాథ్. వేగంగా దూసుకొచ్చిన ఆ బంతి కింద పడ్డాక గాల్లో స్వింగ్ అవుతూ అతడి ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది. ఈ వికెట్​ను నెమరు వేసుకుంటున్న అభిమానులు.. అన్​ప్లేయబుల్ డెలివరీకి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. మెక్​గ్రాత్, అక్రమ్​ కూడా శ్రీనాథ్ బౌలింగ్​ ముందు పనికిరారని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనాథ్ భారత్​కు లభించిన గొప్ప పేసర్ అని కొనియాడుతున్నారు. ఇక, ఆ మ్యాచ్​లో భారత్ 47.4 ఓవర్లకు 126 రన్స్​కు ఆలౌట్ అయింది. విండీస్ ఆ టార్గెట్​ను 41 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఛేజ్ చేసింది. మరి.. శ్రీనాథ్ అన్​ప్లేయబుల్ డెలివరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్​కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!