iDreamPost

IND vs SA: సౌతాఫ్రికా టూర్​కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

  • Author singhj Published - 06:09 PM, Wed - 6 December 23

సౌతాఫ్రికా టూర్​కు వెళ్లేముందు భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక స్టార్ ప్లేయర్ ఈ సిరీస్​కు దూరం కానున్నాడని తెలిసింది.

సౌతాఫ్రికా టూర్​కు వెళ్లేముందు భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక స్టార్ ప్లేయర్ ఈ సిరీస్​కు దూరం కానున్నాడని తెలిసింది.

  • Author singhj Published - 06:09 PM, Wed - 6 December 23
IND vs SA: సౌతాఫ్రికా టూర్​కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ముగియడంతో టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికా టూర్​పై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ఆ సిరీస్​కు సెలక్ట్ అయిన టీమ్స్​ను అక్కడికి పంపింది. డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమయ్యే సఫారీ సిరీస్​ జనవరి 7వ తేదీన ముగుస్తుంది. ఇందులో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలతోపాటు రెండు టెస్టులు ఆడనుంది. మరో ఏడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్​లో పొట్టి ఫార్మాట్​లోని మ్యాచుల మీద మన జట్టు ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఎక్కువ మంది యంగ్​స్టర్స్​కు ఛాన్సులు ఇచ్చి టీమ్ కాంబినేషన్​ను సెట్ చేసుకోవాలని చూస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ సైకిల్ 2023-2025లో టాప్​లో నిలిచిన జట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తాయి. కాబట్టి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కూడా భారత్​కు కీలకంగా మారింది.

సఫారీ టూర్ స్టార్ట్ అయ్యేందుకు ఇంకా నాల్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ టూర్​కు ఓ స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. అతడు మరెవరో కాదు.. యంగ్ పేసర్ దీపక్ చాహర్. చాన్నాళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చాడతను. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో నాలుగో మ్యాచ్​లో అతడు బరిలోకి దిగాడు. ఆ టీ20లో ఆరంభ ఓవర్లలో భారీగా రన్స్ ఇచ్చిన చాహర్.. ఆ తర్వాత పుంజుకొని రెండు కీలక వికెట్లు తీశాడు. ఐదో టీ20 ఆడాల్సిన అతడు అనూహ్యంగా టీమ్​కు దూరమయ్యాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్లిపోయాడు. తండ్రిని హాస్పిటల్​లో జాయిన్ చేయాల్సి రావడంతో ఆ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు.

ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20కి దూరమైన దీపక్ చాహర్.. సౌతాఫ్రికాతో వన్డే, టీ20 టీమ్స్​కు సెలక్ట్ అయ్యాడు. అయితే ఇప్పటికే టీమ్​తో కలసి అక్కడికి వెళ్లాల్సింది. కానీ తండ్రి అనారోగ్యంతో ఉండటంతో చాహర్ ఇక్కడే ఆగిపోయాడు. ‘మేం కరెక్ట్ టైమ్​కు మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లాం. లేకపోతే సిచ్యువేషన్ డేంజరస్​గా మారేది. ఆయన ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉంది. మా నాన్న హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను క్రికెటర్​ను చేయడానికి ఆయన ఎంతో శ్రమించారు. అలాంటప్పుడు ఆయన ఇలా ఆస్పత్రిలో ఉంటే నేను గ్రౌండ్​లో మనసు పెట్టి ఆడలేను. ఆయన్ను ఈ పరిస్థితుల్లో ఇలా వదిలి ఎక్కడికీ వెళ్లను. ఆయన రికవర్ అయ్యాకే సౌతాఫ్రికాకు ప్రయాణమవుతా. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్​తో పాటు సెలక్టర్లతో మాట్లాడా’ అని చాహర్ తెలిపాడు. కాగా, సౌతాఫ్రికా టూర్​కు వెళ్లిన భారత స్క్వాడ్​లో టీ20 టీమ్​కు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్, టెస్ట్ సిరీస్​కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడతారు.

ఇదీ చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీకి ఊహించని అదృష్టం.. సచిన్​తో కలసి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి