iDreamPost
android-app
ios-app

Gary Kirsten: భారత్​కు మళ్లీ కోచింగ్ ఇచ్చేందుకు రెడీ అంటున్న గ్యారీ కిర్​స్టెన్! కానీ..

  • Published Feb 06, 2024 | 4:39 PM Updated Updated Feb 06, 2024 | 4:56 PM

2011 వన్డే వరల్డ్ కప్​ను భారత్​ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కోచ్ గ్యారీ కిర్​స్టెన్. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన టీమ్​కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి ఛాంపియన్​గా నిలబెట్టాడు.

2011 వన్డే వరల్డ్ కప్​ను భారత్​ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కోచ్ గ్యారీ కిర్​స్టెన్. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన టీమ్​కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి ఛాంపియన్​గా నిలబెట్టాడు.

  • Published Feb 06, 2024 | 4:39 PMUpdated Feb 06, 2024 | 4:56 PM
Gary Kirsten: భారత్​కు మళ్లీ కోచింగ్ ఇచ్చేందుకు రెడీ అంటున్న గ్యారీ కిర్​స్టెన్! కానీ..

ఈ మధ్య కాలంలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా తయారైంది. బ్యాటింగ్ ఎప్పుడూ భారత్ బలంగానే ఉంది. కానీ ఇప్పుడు బౌలింగ్​లోనూ అంతే పవర్​ఫుల్​గా కనిపిస్తోంది. మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా వంటి పేసర్లు.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్పిన్నర్ల కలబోతతో టీమ్ సూపర్ స్ట్రాంగ్​గా మారింది. చాలా మంది యంగ్​స్టర్స్ బ్యాకప్​గా ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఐసీసీ ట్రోఫీల్లో మాత్రం భారత్​కు నిరాశ తప్పడం లేదు. అప్పుడెప్పుడో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాం. ఆ తర్వాత పలుమార్లు సెమీస్, ఫైనల్స్​కు వెళ్లినా కప్పును మాత్రం ఒడిసిపట్టలేకపోయాం. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా తుదిమెట్టుపై జారి కప్పులు కోల్పోవడంపై మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్ రియాక్ట్ అయ్యాడు. 2011 వరల్‌ కప్​లో భారత్​ను విజేతగా నిలిపిన కిర్​స్టెన్.. ఇప్పుడు అవసరమైతే టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్-2023 మిస్ అయినప్పటికీ.. త్వరలోనే టీమిండియా ప్రపంచ కప్​ను సాధిస్తుందని కిర్​స్టెన్ అన్నాడు. అయితే మెగాటోర్నీలో విజేతగా నిలవడం అంత ఈజీ కాదన్నాడు. ఇది చాలా కష్టమని తెలిపాడు. ‘ప్రపంచ కప్​ను నెగ్గడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఫైనల్​లో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే. అయితే, టీమిండియా మాత్రం గట్టిపోటీ ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్​ వరల్డ్ కప్ గెలవడం ఖాయం. అది త్వరలోనే నెరవేరుతుందని భావిస్తున్నా. మరికొన్ని నెలల్లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్​లో భారత్ గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఆ సత్తా టీమిండియాకు ఉందనడంలో ఏ డౌట్ లేదు. అయితే, నాకౌట్ దశలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొట్టి ఫార్మాట్​లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది’ అని కిర్​స్టెన్ చెప్పుకొచ్చాడు.

ప్రతి ఏడాది తాను భారత్​కు వస్తుంటానని కిర్​స్టెన్ పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​ ఫ్రాంచైజీకి మెంటార్​గా వ్యవహరించబోతున్నానని తెలిపాడు. టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు దీని గురించి ఆలోచించడం లేదన్నాడు. ఫోకస్ మొత్తం గుజరాత్ టైటాన్స్​ను నడిపించడం మీదే ఉందని కిర్​స్టెన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో శుబ్​మన్ గిల్ బెస్ట్ అని మెచ్చుకున్నాడు. గత ఐపీఎల్​లో అతడు 890 పరుగులు చేశాడని.. ఈసారి కూడా బ్యాటర్​గా, కెప్టెన్​గా రాణిస్తాడని భావిస్తున్నానని కిర్​స్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20లకు వరల్డ్​వైడ్​గా ఆదరణ పెరుగుతోందని.. క్రికెట్​లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తిని నింపడంలో ఈ లీగ్​ల పాత్ర ఎంతో ఉందన్నాడు. మరి.. భారత్​కు మళ్లీ కోచింగ్ చేసేందుకు తాను రెడీ అంటూ కిర్​స్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.