iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించినా.. అతనికి మాత్రం గండమే!

Team India For T20 WC 2024- This Player Place In Dilemma: 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ని ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో చోటు సంపాదించుకున్నా కూడా ఒకడికి మాత్రం గండం తప్పడం లేదు.

Team India For T20 WC 2024- This Player Place In Dilemma: 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ని ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో చోటు సంపాదించుకున్నా కూడా ఒకడికి మాత్రం గండం తప్పడం లేదు.

వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించినా.. అతనికి మాత్రం గండమే!

ఐపీఎల్ సంగతేమో గానీ.. పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు రాటు దేలుతున్నారు. టీమిండియా కూడా ఐపీఎల్ 2024 సీజన్ రూపంలో స్క్వాడ్ ని గట్టిగానే రెడీ చేస్తోంది. తాజాగా తుది జట్టును కూడా ప్రకటించింది. ఈ స్క్వాడ్ చూసిన తర్వాత చాలా దేశాలు కాస్త కంగారు పడ్డాయి. ఎందుకంటే అంతా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఇరగదీస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు అంతా ఐపీఎల్ రికార్డులు బద్దలయ్యే ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఒక ప్లేయర్ ప్లేస్ మీద మాత్రం గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు అన్ని దేశాలు సమాయత్తం అవుతున్నాయి. తమ తమ జట్లను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే న్యూజిల్యాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, టీమిండియా జట్లను ప్రకటించింది. ప్రస్తుతం అంతా టీమిండియా జట్టు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టీమ్ ని చూస్తే శత్రుదుర్భేద్యంగా ఉంది. సీనియర్స్ మాత్రమే కాకుండా.. కుర్రాళ్లు కూడా ఉన్నారు. టీమ్ ప్లేస్ దొరికిన వాళ్లంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ, ఒక్కడికి మాత్రం జట్టులో చోటు దక్కినా ప్రశాంతత లేదు. ఎందుకంటే అతని స్థానానికి గండం పొంచి ఉంది. మే 25 వరకు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఏమాత్రం పర్ఫార్మెన్స్ తగ్గినా చోటు పోయినట్లే.

ఇప్పుడు చెప్పుకుంటోంది.. మరెవరి గురించో కాదు యశస్వీ జైస్వాల్ గురించి. అవును తుది జట్టులో యశస్వీ జైస్వాల్ కు చోటు దక్కింది. అయితే అతనికి గండం మాత్రం పొంచే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో జైస్వాల్ ప్రదర్శన అంతా గొప్పగా ఏమీ లేదు. కంటిన్యూగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇప్పటికి ఫైనల్ టీమ్ లో చోటు సంపాదించుకున్నాడు. కానీ, మిగిలిన ఈ సీజన్ మొత్తం కూడా జైస్వల్ అంతే బాగా పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కచ్చితంగా అతడిని రీప్లేస్ చేసేందుకు ఆటగాళ్లు స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు. రిజర్వ్ లో ఉన్న శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ రూపంలో జైస్వాల్ కు గట్టి పోటీనే ఉంది.

ముఖ్యంగా గిల్ గనుక మరింత రెచ్చిపోయి ఆడితే అభిప్రాయం మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇకనుంచి రాజస్థాన్ రాయల్స్ ఆడే ప్రతి మ్యాచ్ లో జైస్వాల్ ప్రదర్శన టాప్ నాచ్ గానే ఉండాలి. లేదంటే ఫైనల్ 11లో చోటు కంటిన్యూ అవ్వడం కష్టమే అవుతుంది. ఒక్క జైస్వాల్ అనే కాదు.. ఏ ప్లేయర్ అయినా తమ ఉత్తమ ప్రదర్శనను చేస్తూనే ఉండాలి. బీసీసీఐ కూడా ఈ జట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ ని ప్రాక్టీస్ కోసం మంచి వేదికగా మలుచుకుంది. విదేశీ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో టీమిండియా ఆటగాళ్లకు బాగా తెలిసే ఛాన్స్ ఉంది. మరి.. యశస్వీ జైస్వాల్ ప్లేస్ భద్రమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.