Dharani
ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరలవుతోంది. అమితాబ్‌ను మ్యాచ్ చూడవద్దని కోరుతున్నారు. ఎందుకంటే..
ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరలవుతోంది. అమితాబ్‌ను మ్యాచ్ చూడవద్దని కోరుతున్నారు. ఎందుకంటే..
Dharani
2023 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఈసారి విజేత ఎవరో తేలడానికి మరొక్క రోజు సమయం మాత్రమే ఉంది. నవంబర్ 19 అనగా ఆదివారం.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో ఆస్ట్రేలియా, ఇండియా తలపడున్నాయి. విజయం మీద ఇరు జట్లు పూర్తి నమ్మకంగా ఉన్నాయి. తమ జట్టే గెలుస్తుంది.. అంటే.. తమ టీమే విజయం సాధిస్తుందని ఇరు జట్ల అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ వీక్షించడం కోసం క్రికెట్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరలవుతోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ని ఫైనల్ మ్యాచ్ చూడవద్దంటూ కోరుకుంటున్నారు నెటిజనులు. కారణం ఏంటి అంటే..
బిగ్‌బీని మ్యాచ్ చూడొద్దు అని కొరడానికి ఓ కారణం ఉంది. రెండు రోజుల క్రితం సెమిఫైనల్స్‌లో భాగంగా వాంఖడే వేదికగా.. టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడి.. గ్రాండ్ విక్టరీ సాధించింది. ఏకంగా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ టీమీండియా విక్టరీపై స్పందిస్తూ.. నేను ఈ మ్యాచ్ చూడలేదు.. అందుకే ఇండియా విజయం సాధించింది అంటూ ట్వీట్ చేశారు. నేను మ్యాచ్ చూడకపోతే.. ఇండియా కచ్చితంగా గెలుస్తుందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు బిగ్ బీ. అయితే అప్పుడు దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. మాత్రం బిగ్ బీని మ్యాచ్ చూడవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజనులు.
T 4831 – when i don’t watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023
ఈ క్రమంలోనే సెమి ఫైనల్స్ సందర్భంగా అమితాబ్ చేసిన ట్వీట్‌ను ఇప్పుడు మరోసారి తెర మీదకు తీసుకువచ్చిన నెటిజనులు.. ప్లీజ్ సార్ మీరు మాత్రం ఫైనల్ మ్యాచ్ చూడకండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు చూడకుంటే.. టీమిండియా సెమీస్‌లో విజయం సాధించింది.. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా చూడకండి.. కప్పు మనదే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ల రిక్వెస్ట్‌లపై అమితాబ్ స్పందించారు. వీటన్నింటిని చూసిన తర్వాత.. నేను మ్యాచ్‌కు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు. అది కూడా ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
T 4832 – अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహాల పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అలానే ఆస్ట్రేలియా డిస్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లను చేసింది గుజరాత్ ప్రభుత్వం. సుమారు 4500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో టైమింగ్స్‌ను మార్చడం మాత్రమే కాక.. ఎక్కువ సంఖ్యలో రైళ్లను అందుబాటులో ఉంచనున్నారు. అలానే మ్యాచ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటికల్ బృందం ప్రత్యేక విన్యాసాలు చేయనుంది. దీంతో పాటు లేజర్ షో, మ్యాచ్ ముగిశాక భారీ ఎత్తున ఫైర్ వర్క్స్‌ను నిర్వహించనున్నారు.