IND vs NZ- Team India Approach In Knockout Match: ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకిలా? నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా వ్యూహం!

ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకిలా? నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా వ్యూహం!

వరల్ట్ కప్ సెమీస్ కివీస్ తో అనగానే భారత్ అభిమానుల్లో రైళ్లు పరిగెత్తాయి. అందరికీ 2019 గుర్తొచ్చింది. అయితే ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అయితే దాని వెనుక బలమైన వ్యూహమే ఉంది.

వరల్ట్ కప్ సెమీస్ కివీస్ తో అనగానే భారత్ అభిమానుల్లో రైళ్లు పరిగెత్తాయి. అందరికీ 2019 గుర్తొచ్చింది. అయితే ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అయితే దాని వెనుక బలమైన వ్యూహమే ఉంది.

వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఎదురులేని జట్టుగా కొనసాగుతోంది. ఏ టీమ్ కూడా భారత్ ను అడ్డుకోలేకపోయింది. సెమీస్ లో కివీస్ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. ఏ పాయింట్ లో కూడా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇక్కడే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా స్కోర్ కార్డు ఎప్పుడూ ఫుట్ బాల్ బోర్డుని తలపించేది. 2 పరుగలకు 2 వికెట్లు, 5 పరుగులకు 3 వికెట్లు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ, ఈ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అయితే టీమిండియా వ్యూహం ఏంటో చూద్దాం.

సెమీ ఫైనల్ మ్యాచ్ టాస్ గెలిచే ముందు వరకు కూడా టీమిండియా అభిమానుల్లో ఒకరకమైన ఆందోళన ఉంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలుస్తారు, టాస్ ఓడితే మ్యాచ్ ఓడుతారు అంటూ ఒక సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. అయితే టీమిండియా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుని క్రీజులోకి వచ్చింది. ఆట మొదలైనప్పటి నుంచి రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లపై ఎక్కడా జాలిచూపలేదు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే చూశాడు. నిజానికి రోహిత్ శర్మ అటాకిగ్ చూసి అంతా షాకయ్యారు. ఎందుకు ఇంత దూకుడుగా ఆడుతున్నాడు అనుకున్నారు. అయితే ఒక్క రోహిత్ శర్మానే కాదు.. టీమిండియా అప్రౌచ్ మారిపోయింది.

నిజానికి ఒక నాకౌట్ మ్యాచ్ లో భారత్ ఇంత దూకుడుగా ఇదే ప్రథమం. అందుకు ఉదాహరణగా ఈ మ్యాచ్ పవర్ ప్లే గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది. ఫుట్ బాల్ స్కోర్ బోర్డ్ అనే దగ్గరి నుంచి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్, సౌథీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. శాంట్నర్ ని ఎర్లీగా తీసుకువచ్చారు. అతడిని కూడా రోహిత్ శర్మ వదల్లేదు. ఆ తర్వాత కూడా టీమిండియా దూకుడు తగ్గలేదు. రోహిత్ శర్మ అవుటయ్యాక శుభ్ మన్ గిల్ వేగం పెంచాడు. కేవలం 65 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు కూడా టీమిండియా వేగం తగ్గలేదు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆటలో మరింత జోష్ పెంచారు. కోహ్లీ అయితే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అయ్యర్ కూడా శతకంతో చెలరేగాడు. వరల్డ్ కప్ లో నంబర్ 4 అంతకంటే తర్వాత బ్యాటింగ్ వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే ఇలా ఎందుకు ఆడారు అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. అందుకు టీమిండియా పెద్ద వ్యూహంతోనే బరిలోకి దిగిందని చెప్పాలి.

ఎందుకంటే కివీస్ తో మ్యాచ్ ముందు నుంచి కూడా అందరిలో ఒక విధమైన భయం ఉంది. ఆ భయాన్ని అధిగమించాలంటే కచ్చితంగా అటాకింగ్ చేయాలి అని ఫిక్స్ అయినట్లు కనిపించారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇన్నేళ్లలో తొలిసారి నాకౌట్ మ్యాచ్ లో దూకుడుగా ఆడారు. అది కూడా పక్కా ప్రణాళికతోనే చేశారు. భయపడుతూ వికెట్లు పోగొట్టుకోవడం కంటే కూడా.. ఫాస్ట్ గా ఆడి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాలని ఫిక్స్ అయ్యారు. అలాగే అటాకింగ్ ఆడటం వల్ల కచ్చితంగా న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు స్కోర్ చేయడం మరింత తేలిక అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ లక్ష్యం ఇవ్వడం వల్ల టీమిండియా బౌలర్లు కూడా ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తారు. ఈ మొత్తం పాయింట్స్ తోనే భారత్ ఇంత దూకుడుగా ఆడింది. ఆ ఫార్ములా వర్కౌట్ కూడా అయ్యింది. నిర్ణీత 50 ఓర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కివీస్ విజయం సాధించాలంటే.. 50 ఓవర్లలో 398 పరుగులు చేయాలి. మరి.. టీమిండియా వ్యూహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments