iDreamPost
android-app
ios-app

వీడియో: హెడ్‌ కోచ్‌గా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లోనే ఆటగాళ్లతో చెమటలు కక్కించిన గంభీర్‌!

  • Published Jul 23, 2024 | 6:01 PM Updated Updated Jul 23, 2024 | 6:01 PM

Gautam Gambhir, IND vs SL: హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడో లేదో.. తన మార్క్‌ చూపిస్తూ.. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లోనే ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, IND vs SL: హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడో లేదో.. తన మార్క్‌ చూపిస్తూ.. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లోనే ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 23, 2024 | 6:01 PMUpdated Jul 23, 2024 | 6:01 PM
వీడియో: హెడ్‌ కోచ్‌గా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లోనే ఆటగాళ్లతో చెమటలు కక్కించిన గంభీర్‌!

గౌతమ్‌ గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను పూర్తి చేసుకున్నాడు. సోమవారం ముంబైలో బీసీసీఐ నిర్వహించిన అధికారిక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి హెడ్‌ కోచ్‌ హోదాలో తొలిసారి పాల్గొన్న గంభీర్‌.. మీడియా వాళ్లు అడిగిన పలు ప్రశ్నలు బదులిచ్చి.. యంగ్‌ టీమిండియాను తీసుకొని శ్రీలంక వెళ్లాడు. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ముందుగా టీ20 సిరీస్‌ ఆడే జట్టు.. సోమవారం ముంబై ఎయిర్‌ పోర్టు నుంచి శ్రీలంకకు బయలుదేరిన విషయం తెలిసిందే.

శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన తర్వాత.. ఈ రోజు పల్లెకలె క్రికెట్‌ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కు ఇదే తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ కావడంతో అందరి కళ్లు అతనిపైనే ఉన్నాయి. అయితే.. హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకుని.. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న గంభీర్‌.. ఏ మాత్రం టైమ్‌ తీసుకోకుండా భారత యువ ఆటగాళ్లతో ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేయించాడు. తొలి రోజే తన మార్క్‌ ప్రాక్టీస్‌తో ఆటగాళ్లతో చెమటలు కక్కించాడు గంభీర్‌.

ఈ పని రాక్షసుడితో ఇలాగే ఉంటుందంటూ.. క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియలో కామెంట్‌ చేస్తున్నారు. కానీ, టీమిండియా ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమిండియా.. శ్రీలంకతో తలపడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ తర్వాత.. భారత జట్టు ఒక బలమైన జట్టును ఢీకొనబోతోంది. అయితే.. జట్టులో అంతా యంగ్‌ ప్లేయర్లే ఉన్నా.. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఉండటంతో భారత క్రికెట్‌ అభిమానులు జట్టు విజయంపై నమ్మకంగా ఉన్నారు. మరి తొలి ప్రాక్టీస్‌లోనే ఆటగాళ్లకు గంభీర్‌ చుక్కలు చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.