iDreamPost
android-app
ios-app

సిక్స్ ప్యాక్​తో టీమిండియా డాషింగ్ బ్యాటర్.. గుర్తుపట్టండి చూద్దాం!

  • Published Mar 10, 2024 | 6:09 PM Updated Updated Mar 10, 2024 | 6:11 PM

టీమిండియా డాషింగ్ బ్యాటర్ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. అతను ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

టీమిండియా డాషింగ్ బ్యాటర్ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. అతను ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

  • Published Mar 10, 2024 | 6:09 PMUpdated Mar 10, 2024 | 6:11 PM
సిక్స్ ప్యాక్​తో టీమిండియా డాషింగ్ బ్యాటర్.. గుర్తుపట్టండి చూద్దాం!

ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్ ముగియడంతో టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు జాలీ మూడ్​లో ఉన్నారు. సిరీస్​లోని ఆఖరి టెస్టు మూడ్రోజుల్లోనే పూర్తవడంతో దొరికిన రెస్ట్​ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగూ ఇంకో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకో మూడ్నాలుగు రోజుల్లో ఆయా ఫ్రాంచైజీలతో ఆటగాళ్లు కలవాలి. అందుకే దొరికిన రెండు, మూడ్రోజులు విశ్రాంతిని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ టీమిండియా యంగ్ క్రికెటర్ సేదతీరేందుకు ట్రిప్​నకు వెళ్లాడు. ఈ సందర్భంగా సముద్రం పక్కన అతడు టవల్ కట్టుకొని సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ లుక్​లో ఫొటో దిగి నెట్టింట పెట్టాడు. ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఒక భారత యంగ్ బ్యాటర్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అతడు ఒంటికి టవల్​తో కనిపించాడు. షర్ట్ కూడా వేసుకోని అతడు.. నెత్తికి క్యాప్ పెట్టుకున్నాడు. ఇందులో అతడి సిక్స్ ప్యాక్ బాడీ హైలైట్ అవుతోంది. ఆ ఆటగాడు ఎవరో ఈపాటికే గుర్తుపట్టి ఉంటాడు. అతడు మరెవరో కాదు.. శుబ్​మన్ గిల్. సముద్రానికి దగ్గర బీచ్​లో టవల్​పై గిల్ దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ స్టైలిష్​గా అతడు దిగిన పిక్స్​ను టీమిండియా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గిల్ అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడని చెబుతున్నారు.

అది బాడీ కాదు.. రన్ మెషీన్ అని, దాని నుంచి పరుగులే పరుగులు వస్తాయంటూ అంటూ మరికొందరు నెటిజన్స్ గిల్ ఫొటోపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఫిట్​గా ఉన్నాడు కాబట్టే అలవోకగా బౌండరీలు, సిక్సులు బాదుతున్నాడని చెబుతున్నారు. గిల్ ఇదే ఫిట్​నెస్​ను మెయింటెయిన్ చేయాలని సూచిస్తున్నారు. ఇక, ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో బ్యాట్​తో చెలరేగిపోయాడు గిల్. తొలి టెస్టులో ఫెయిలైన ఈ స్టార్ బ్యాటర్.. ఆ తర్వాత చెలరేగిపోయాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ 400కి పైగా పరుగులు చేశాడు. ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్​లో ముందుకొచ్చి అతడు కొట్టిన సిక్సర్ సిరీస్​కే మెయిన్ హైలైట్​గా నిలిచింది. ఈ సిరీస్​ ద్వారా వన్డేలతో పాటు టెస్టుల్లోనూ విరాట్ కోహ్లీకి తాను సరైన వారసుడ్నని ప్రూవ్ చేశాడు గిల్. మరి.. శుబ్​మన్ సిక్స్ ప్యాక్ స్టిల్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్​లో శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్.. 37 బంతుల్లోనే..!