Nidhan
Team India Cricketer: టీమిండియాలోకి వచ్చినా పెద్ద ఛాన్సులు దక్కనివారిలో అతనొకడు. తానేంటో ప్రూవ్ చేసినా పరిస్థితుల కారణంగా డొమెస్టిక్ క్రికెట్‌కే పరిమితం అయ్యాడు. అలాంటోడు తాను పడిన ఒత్తిడి, బాధను తాజాగా షేర్ చేశాడు.
Team India Cricketer: టీమిండియాలోకి వచ్చినా పెద్ద ఛాన్సులు దక్కనివారిలో అతనొకడు. తానేంటో ప్రూవ్ చేసినా పరిస్థితుల కారణంగా డొమెస్టిక్ క్రికెట్‌కే పరిమితం అయ్యాడు. అలాంటోడు తాను పడిన ఒత్తిడి, బాధను తాజాగా షేర్ చేశాడు.
Nidhan
క్రికెటర్లు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లకేం తక్కువని చాలా మంది అపోహ పడతారు. కోట్లకు కోట్లు డబ్బులు వచ్చి పడతాయి, నేమ్, ఫామ్ ఉంటుంది. క్షణాల్లో కోరుకున్నది దక్కుతుందని పొరపాటు పడతారు. అయితే ప్లేయర్ల కెరీర్ అంత ఈజీ ఏమీ కాదు. క్రిటిసిజమ్‌ను ఫేస్ చేయాలి. ఫుల్ కాంపిటీషన్, ప్రెజర్‌ను తట్టుకొని పెర్ఫార్మ్ చేయాలి. కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ క్రమంలో వచ్చే సవాళ్లను తట్టుకొని నిలబడాలి. అయితే కొందరు వీటిని ఫేస్ చేసినా, మరికొందరు మాత్రం బాధ, ఒత్తిడని భరించలేక డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇలానే మృతి చెందాడు. గతంలో డేవిడ్ జాన్సన్, వీబీ చంద్రశేఖర్ కూడా ఇలాగే చనిపోయారు.
గ్రాహం థోర్ప్ ఆత్మహత్మపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రియాక్ట్ అయ్యాడు. మానసికంగా కుంగుబాటు ఎదురైనప్పుడు దాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో అతడు చెప్పాడు. భారత జట్టులోకి వచ్చినా పెద్ద ఛాన్సులు దక్కనివారిలో ఊతప్ప ఒకడు. తానేంటో ప్రూవ్ చేసినా పరిస్థితుల కారణంగా డొమెస్టిక్ క్రికెట్‌కే పరిమితం అయ్యాడు. అలాంటోడు తాను పడిన ఒత్తిడి, బాధను తాజాగా షేర్ చేశాడు. ఆ రోజు తాను ఎంతో నరకం చూశానని అన్నాడు. ఒక మూమెంట్లో ఎందుకు బతికి ఉన్నానా అని అనిపించిందని చెప్పాడు. డిప్రెషన్‌కు గురై ప్రాణాలు వదిలే వారిని చూస్తే చాలా బాధేస్తుందని ఊతప్ప తెలిపాడు. గతంలో తాను కూడా సేమ్ సిచ్యువేషన్‌ను ఫేస్ చేశానని గుర్తు చేసుకున్నాడు. టీమిండియాలోకి ఛాన్సులు రాకపోవడంతో విమర్శలు ఎక్కువయ్యాయని.. అవి తనను మనోవేదనకు గురిచేశాయన్నాడు ఊతప్ప.
‘డిప్రెషన్ తట్టుకోలేక గ్రాహం థోర్ప్, డేవిడ్ జాన్సర్, వీబీ చంద్రశేఖర్ లాంటి క్రికెటర్లు ప్రాణాలు విడిచారు. నేను కూడా ఆ స్టేజ్‌ను దాటి వచ్చినవాడ్నే. ఆ జర్నీ చాలా దారుణంగా ఉంటుంది. మెంటల్‌గా చాలా వీక్ అయిపోతాం. మనల్ని ఇష్టపడే వారికి భారంగా మారుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ టైమ్ అత్యంత కఠినమైనదిగా చెప్పొచ్చు. మనకు విలువ లేదా అని బాధపడతాం. 2011లో నేను కూడా ఇదే ఫేస్ చేశా. ఎందుకు బతికి ఉన్నానా అని సిగ్గేసేది. లైఫ్‌లో ఏం చేయాలనే క్లారిటీ లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆ ఒక్క రోజు లేకుంటే బాగుండునని అనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేందుకు సాయం అవసరం అవుతుంది. మంచి సపోర్ట్ దొరికితే బయటపడొచ్చు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
I’ve faced many battles on the cricket field, but none as tough as the one I fought with depression. I’m breaking the silence around mental health because I know I’m not alone.
Prioritise your well-being, seek help, and find hope in the darkness.
I share my story on this… pic.twitter.com/XSACIZUfm4
— Robbie Uthappa (@robbieuthappa) August 20, 2024