iDreamPost
android-app
ios-app

ఫోన్ మాట్లాడుతున్న ఈ టీమిండియా దిగ్గజ క్రికెటర్ ని గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Published - 06:57 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 06:57 PM, Tue - 11 July 23
ఫోన్ మాట్లాడుతున్న ఈ టీమిండియా దిగ్గజ క్రికెటర్ ని గుర్తుపట్టారా?

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల, రాజకీయ నాయకుల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ టీమిండియా దిగ్గజ క్రికెటర్ కు సంబంధించిన చిన్ననాటి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మ చేతిలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న ఈ బుడ్డోడిని మీరు గుర్తుపట్టారా? మీకో క్లూ ఇస్తాను.. ఈ బుడ్డోడు టీమిండియా తరపున ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో వివాదాలకు దూరంగా అతికొద్ది మందిలో ఇతడూ ఒకడు. ఇంకా గుర్తుకు రాలేదా? చిన్నప్పటి నుంచి చాలా కామ్ గా ఉంటాడని వాళ్లమ్మ చెప్పింది. కానీ తాజాగా ఓ యాడ్ లో గూండాల నటించి అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ బుడతడు.

ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్న ఈ బుడతడు.. వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు. ఒక్కసారి క్రీజ్ లోకి వచ్చాడు అంటే.. బౌలర్ల సహనానికి పరీక్షపెడతాడు. అతడిని అవుట్ చేయడానికి బౌలర్లు నానా తంటాలు పడుతుంటారు. ఇంత చెప్పినా ఈ బుడతడిని ఇంకా గుర్తుపట్టలేదా? చివరిగా మీకో పెద్ద క్లూ.. అతడు టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు అడ్డుగోడలా నిలిచి జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. ఇప్పుడు తెలిసిందా? ఫోన్ మాట్లాడే బుడ్డోడు భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అని. అవును అమ్మచేతిలో ఉండి ఫోన్ తో హీరోలా స్టిల్ ఇచ్చిన ఈ పసివాడు టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. చిన్నతనం నుంచి ఎప్పుడూ కూల్ గా, కామ్ గా ఉండే ద్రవిడ్ ఓ యాడ్ లో నటించాడు. ఆ యాడ్ ను చూసిన తన తల్లి ఇప్పటికీ నేను అలా ప్రవర్తించాను అంటే నమ్మట్లేదని చెప్పుకొచ్చాడు మిస్టర్ డిఫెండబుల్.

2021లో క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ యాప్ క్రెడ్ లో ద్రవిడ్ నటించాడు. ఆ యాడ్ లో ద్రవిడ్ “నేను ఇందిరానగర్ గూండాను” అంటూ తన కోపంతో ఊగిపోతూ.. పక్కన ఉన్న కార్లను బ్యాట్ తో ధ్వంసం చేస్తుంటాడు. ఈ యాడ్ చూసిన నెటిజన్లు సైతం ద్రవిడేనా ఇది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ యాడ్ కు సంబంధించిన కుషాల్ షా(క్రెడ్ వ్యవస్థాపకుడు) తో జరిపిన ఓల్డ్ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మా అమ్మ నేను ఇంట్లో గ్లాస్ పగలగొట్టాను అంటేనే నమ్మదు. అలాంటిది ఈ యాడ్ లో ఇంతచేశాను అంటే ఇప్పటికీ నమ్మట్లేదు అంటూ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ద్రవిడ్ కు సంబంధించిన చిన్ననాటి పిక్ వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Rahul Dravid (@rahuldravidofficial)