Nidhan
టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీ షా. అతడు కెరీర్లో ఎక్కడికో ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ పత్తా లేకుండా పోయాడీ భారత ఓపెనర్.
టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీ షా. అతడు కెరీర్లో ఎక్కడికో ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ పత్తా లేకుండా పోయాడీ భారత ఓపెనర్.
Nidhan
టాలెంట్ ఉన్న చాలా మంది క్రికెటర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. నేషనల్ టీమ్‌లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. అందుకోసం డొమెస్టిక్ లెవల్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నీలనూ వాడుకుంటున్నారు. ఆయా టోర్నీల్లో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉండటంతో చోటు కోసం కఠోరంగా శ్రమిస్తున్నారు. టీమ్ బయట ఉన్నవారు ఇలా ఉంటే.. జట్టు వెంటే ఉండి ఛాన్సులు రాక బెంచ్ మీదే కాలం వెల్లదీస్తున్న వారూ చాలా మందే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ప్లేయర్ మాత్రం తనకు దక్కిన అవకాశాల్ని యూజ్ చేసుకోవడంలో ఫెయిలై టీమ్‌కు దూరమయ్యాడు. అతడే ఓపెనర్ పృథ్వీ షా. ఈ యంగ్‌స్టర్ ప్రతిభకు ఫిదా అయి కొన్ని అవకాశాలు ఇచ్చినా సరిగ్గా ఆడక టీమ్‌కు దూరమయ్యాడు. ఏడాది కింద 379 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడిన షా.. అప్పటి నుంచి పత్తా లేకుండా పోయాడు.
సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు పృథ్వీ షా. రంజీ ట్రోఫీ-2023 గ్రూప్ దశలో భాగంగా ముంబై, అస్సాం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ స్టైలిష్ బ్యాటర్ ఆడిన ఇన్నింగ్స్ కారణంగా ముంబై జట్టు ఇన్నింగ్స్ 128 రన్స్ తేడాతో అస్సాంను చిత్తు చేసింది. ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో షా 383 బంతులు ఎదుర్కొని ఏకంగా 379 పరుగులు చేశాడు. 4 సిక్సులతో పాటు 49 బౌండరీలు బాదాడు. ఫోర్ల రూపంలోనే దాదాపు 200 పరుగులు చేశాడు షా. రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇంగ్లండ్‌కు వెళ్లి కౌంటీల్లో ఆడదామని అనుకున్నాడు. అక్కడ కొన్ని మ్యాచుల్లో బాగానే ఆడినా.. గాయం కావడంతో సడన్‌గా తప్పుకున్నాడు.
గతేడాది ఐపీఎల్లో ఫెయిలైన పృథ్వీ షా.. ఈసారి రంజీ ట్రోఫీతో పాటు క్యాష్ రిచ్ లీగ్‌లోనూ బాగా పెర్ఫార్మ్ చేస్తే తిరిగి టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఆ మధ్య బాగా బరువు పెరిగిన అతడు.. కౌంటీ క్రికెట్లోనూ దీని వల్ల సమస్యలు ఎదుర్కొన్నాడు. బరువు కారణంగా కొన్ని షాట్స్ ఆడటంలో ఇబ్బందులు ఎదుర్కోవడమే గాక బ్యాటింగ్ చేస్తూ కింద పడ్డాడు. చివరగా 2021, జులై 23న భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు షా. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అతడ్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదు. ఇచ్చిన అవకాశాలను వాడుకోకపోవడం.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్‌స్టర్స్ రాణిస్తుండటంతో షాకు సెలక్టర్లు మొండిచెయ్యి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు టీమ్‌లోకి రావాలంటే తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ను బయటకు తీయాలి. కొన్ని నెలల పాటు కంటిన్యూగా రాణించాలి. అప్పుడు గానీ ఛాన్స్ దొరికేలా లేదు. మరి.. షా కెరీర్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీమిండియా ప్రత్యర్థికి దినేష్ కార్తీక్ సాయం.. తేడా కొట్టిందా ఇక అంతే సంగతులు!
On This Day in 2023, @PrithviShaw scored the 2nd Highest First-Class Score by an Indian.
He Scored 379(383) with 49 Fours and 4 Sixes against Assam in Guwahati.
📷 PTI pic.twitter.com/IIPj2QKEfg
— CricketGully (@thecricketgully) January 11, 2024