టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ కేసు గురించి అందరికి తెలిసిందే. పృథ్వీ షా తనను లైంగికంగా వేధించాడని సప్నా గిల్ అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఇక సప్నా స్నేహితులే తమపై దాడి చేశారని షా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నెలలుగా దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా కోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు.
పృథ్వీ షా.. గత కొంత కాలంగా టీమిండియాలో చోటు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ సీజన్ లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడు షా. ఈ సమస్యలతోనే షా సతమతం అవుతుంటే.. మోడల్ సప్నా గిల్ తో వివాదం మరో సమస్యగా మారింది. కాగా.. పృథ్వీ షా-సప్నాగిల్ మధ్య జరిగిన గొడవ గురించి మనందరికి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక నివేదికను కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఈ నివేదికతో పృథ్వీ షాకు ఊరట లభించింది. అసలు విషయం ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా తనను లైంగికంగా వేధించాడని, బేస్ బాల్ బ్యాట్ తో దాడి చేశాడని మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సప్నా గిల్ అంధేరి మెజిస్ట్రేట్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పృథ్వీ షాపై సప్నా గిల్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలేమీ లేవని, ఆమె ఆరోపణలు తప్పు అని కోర్టుకు ఇచ్చిన నివేదికలో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. దాంతో పృథ్వీ షాకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది.