ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుత ప్రదర్శనతో టెస్టు, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టూర్ లో టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాల బాటపట్టింది. అందులో భాగంగానే యువ క్రికెటర్లతో పాటుగా సీనియర్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. అయితే అవకాశం ఇచ్చినప్పటికీ అందులో కొంతమంది ప్లేయర్స్ ఆ ఛాన్స్ ను వినియోగించుకోలేకపోతున్నారు. ఇక జట్టులోకి సుమారు 10 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు పేసర్ జైదేవ్ ఉనద్కత్. కానీ ఈ సిరీస్ లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే అతడు తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
జైదేవ్ ఉనద్కత్.. 2010లో ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. ఇక ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. అదే ఏడాది టీమిండియాకు ఎంపికైయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు అతడు టీమిండియా తరపున కేవలం 4 టెస్టులు, 10 టీ20లు, 8 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతడికి అవకాశాలు ఇస్తున్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో విఫలం అవుతూ.. జట్టులో స్థానం కోల్పోతున్నాడు. తాజాగా విండీస్ తో టెస్టు సిరీస్ కు అతడికి ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. కానీ రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.
ఇక దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు జైదేవ్. విండీస్ తో జరిగిన మూడో వన్డేలో అతడికి అవకాశం రాగా.. కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక విండీస్ పర్యటన ముగించుకున్న జైదేవ్ ఉనద్కత్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. సుమారు రూ. కోటి రూపాయలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ GLE SUVని అతడు సొంతం చేసుకున్నాడు. ఈ కారులో అత్యధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. పనోరమిక్ సన్ రూఫ్ తో పాటుగా ఏడు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. కాగా.. లగ్జరీ కారు ముందు తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు జైదేవ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదికూడా చదవండి: రూ.కోట్లు సంపాదిస్తున్నా ఇంటింటికీ తిరిగి గ్యాస్ సిలిండర్లు వేస్తున్నాడు!
Ever since I was a kid, i used to dream about owning a Mercedes and going on road trips with my beloved.. that dream came true yesterday! We bought it, we own A Merc!
To all those who dream – keep visualising & keep working for it, cos dreams do come true! ❤️🧿 pic.twitter.com/uZnLYy1UwK
— Jaydev Unadkat (@JUnadkat) September 2, 2022