iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇండియాలో మరో కొత్త క్రికెట్ లీగ్?

  • Published Aug 13, 2024 | 10:14 AM Updated Updated Aug 13, 2024 | 10:14 AM

Legendary Cricket League in India: తాజాగా ఓ న్యూస్ ఇండియన్ క్రికెట్ లో హల్ చల్ చేస్తోంది. త్వరలోనే భారత్ లో IPL తరహాలో మరో కొత్త క్రికెట్ లీగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Legendary Cricket League in India: తాజాగా ఓ న్యూస్ ఇండియన్ క్రికెట్ లో హల్ చల్ చేస్తోంది. త్వరలోనే భారత్ లో IPL తరహాలో మరో కొత్త క్రికెట్ లీగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 13, 2024 | 10:14 AMUpdated Aug 13, 2024 | 10:14 AM
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇండియాలో మరో కొత్త క్రికెట్ లీగ్?

ఎప్పుడైతే ప్రపంచ క్రికెట్ లోకి IPL ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి అని చెప్పొచ్చు. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ను చూసి చాలా దేశాలు లీగ్ క్రికెట్ ను స్టార్ట్ చేశాయి. అయితే ఆ టోర్నీలు ఐపీఎల్ అంత ప్రాచుర్యాన్ని సంపాదించుకోలేకపోయాయి. కానీ.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ లీగ్ లు ఫ్యాన్స్ కు మాత్రం కిక్కిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ లీగ్, టీ10 లీగ్, లంక ప్రీమియర్ లీగ్, SA20 లీగ్ ఇలా చాలా దేశాలు లీగ్ క్రికెట్ ను స్టార్ట్ చేశాయి. తాజాగా ఓ న్యూస్ ఇండియన్ క్రికెట్ లో హల్ చల్ చేస్తోంది. త్వరలోనే భారత్ లో మరో కొత్త క్రికెట్ లీగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ తరహాలో ఇండియాలో మరో కొత్త లీగ్ రాబోతుందా? అంటే అవుననే సమాధానాలే క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరల్డ్ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాటోర్నీలో ఆడాలని కలలు కంటూ ఉంటారు స్టార్, యంగ్ క్రికెటర్లు. ఇక ఇప్పుడు అలాంటి ఓ లీగ్ క్రికెట్ మన దేశంలో రాబోతోంది. అయితే ఇది ప్రస్తుతం క్రికెట్ ఆడే వారికి కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలకు మాత్రమే. అసలు విషయం ఏంటంటే?

టీమిండియాకు చెందిన కొంత మంది రిటైర్డ్ ప్లేయర్లు బీసీసీఐ కార్యదర్శి జై షా దగ్గరికి వెళ్లి.. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాల కొరకు ఓ లెజెండరీ క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దాంతో ఈ విషయంపై బీసీసీఐ ఆలోచిస్తుందని జై షా సదరు ప్లేయర్లకు చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండియన్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బీసీసీఐ తలచుకుంటే దిగ్గజ ప్లేయర్ల పేరిట ఓ లీగ్ ను ప్రారంభించగలదు. దాంతో ఇండియాలో మరో కొత్త లీగ్ ప్రేక్షకులకు కిక్కిస్తుంది. మరి ఇండియాలో ఉన్న దిగ్గజ ప్లేయర్లకు ఓ లీగ్ ను స్టార్ట్ చేయాలని మీలో ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş