Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. అలాంటోడు కెమెరామెన్‌పై సీరియస్ అయ్యాడు. హిట్‌మ్యాన్ కోపానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. అలాంటోడు కెమెరామెన్‌పై సీరియస్ అయ్యాడు. హిట్‌మ్యాన్ కోపానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిత్వం గురించి తెలిసిందే. దశాబ్దంన్నరకు పైగా లాంగ్ కెరీర్లో ఎప్పుడూ ఇతరులతో గొడవకు దిగిన సందర్భాలు లేవు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొట్టినా వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. సొంత జట్టు ప్లేయర్లతో పాటు ఇతర టీమ్స్ వాళ్లతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటాడు హిట్‌మ్యాన్. మ్యాచ్ టైమ్‌లో అప్పుడప్పుడూ కాస్త టెన్షన్లో కనిపించినా.. ఎక్కువగా సరదాగా ఉంటాడు. సహచరుల మీదే కాదు.. ఒక్కోసారి అంపైర్లపై కూడా జోక్స్ వేస్తుంటాడు. స్టంప్ మైక్‌లో అతడి కామెంట్స్ వైరల్‌గా మారడం తెలిసిందే. అయితే ఎప్పుడూ కూల్‌గా ఉండే రోహిత్.. ఈ మధ్య మాత్రం కెమెరామెన్స్పై సీరియస్ అవుతున్నాడు.
ఐపీఎల్-2024లో కెమెరామెన్ వల్ల చిక్కుల్లో పడ్డాడు రోహిత్. ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో అతడి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై టీమ్‌ను తన చేతులతో నిర్మించానని, ఇప్పుడు దాంతో తనకు సంబంధం లేదంటూ అందులో హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో కెమెరామెన్స్ను చూస్తే చాలు రోహిత్ భయపడిపోతున్నాడు. లీగ్ లాస్ట్ స్టేజ్‌లో ఇలాగే ఓ మ్యాచ్‌కు ముందు ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడతను. దీంతో దాన్ని కవర్ చేద్దామని అటు కెమెరామెన్ రాగా.. ఆడియో మ్యూట్ చేయమంటూ అతడికి దండం పెట్టాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు తాజాగా కెమెరామెన్ మీద సీరియస్ అయ్యాడతను.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం యూఎస్ఏకు చేరుకున్నాడు రోహిత్. అక్కడ ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నాడు. జట్టుకు కప్పు అందించాలని కష్టపడుతున్నాడు. ప్రాక్టీస్ చేసి అలసిపోతే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌తో కలసి హిట్‌మ్యాన్ స్టేడియాన్ని చూస్తున్న టైమ్‌లో అటు వైపు కెమెరామెన్ ఫోకస్ చేశాడు. ఆ సమయంలో హిట్‌మ్యాన్ రెండు చేతుల్ని పైకి అంటూ కనిపించాడు. కెమెరాను చూడగానే సీరియస్ అయిన అతడు.. చేతులు పైకి అంటే కూడా వీడియో తీస్తావా అంటూ సీరియస్ అయ్యాడు. బుర్ర లేదా అంటూ కుడి చేతితో సైగ చేశాడు. పక్కనే ఉన్న పంత్ కూడా ఎందుకు తీస్తున్నావన్నాడు. ఇంకో చోట వర్షంలో నుంచి రోహిత్ బయటకు వస్తున్న టైమ్‌లో కెమెరాలు ఫోకస్ చేయడంతో మరోమారు సీరియస్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే హిట్‌మ్యాన్‌ను కెమెరామెన్లు వదిలేలా కనిపించడం లేదు. మరి.. కెమెరామెన్ మీద టీమిండియా కెప్టెన్ సీరియస్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma and Rahul Dravid at the New York. 😂❤️pic.twitter.com/k4kmwxyLd5
— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024