iDreamPost
android-app
ios-app

IND vs BAN: తొలి టెస్ట్‌కి ముందు బంగ్లాదేశ్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

  • Published Sep 17, 2024 | 3:21 PM Updated Updated Sep 17, 2024 | 3:21 PM

Rohit Sharma said we will not take Bangladesh lightly: బంగ్లాదేశ్ ను తాము ఈజీగా తీసుకోట్లేదని చెబుతూనే ఆ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

Rohit Sharma said we will not take Bangladesh lightly: బంగ్లాదేశ్ ను తాము ఈజీగా తీసుకోట్లేదని చెబుతూనే ఆ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

IND vs BAN: తొలి టెస్ట్‌కి ముందు బంగ్లాదేశ్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

పాకిస్థాన్ ను వారి సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. ఇక అదే ఊపును టీమిండియాతో జరగబోయే టెస్టు, టీ20 సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది. పైగా అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలను కూడా రచిస్తోంది. మరోవైపు నెలన్నర విరామం తర్వాత టీమిండియా గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. బంగ్లాతో జరిగే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చి, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజాలతో పాటుగా చాలా మంది బంగ్లా టీమ్ ను ఈజీగా తీసుకోవద్దని టీమిండియాను హెచ్చరిస్తున్నారు. కానీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు ముందు ప్రత్యర్థి టీమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

చిన్న టీమ్ గా ముద్రపడ్డ బంగ్లాదేశ్ ప్రస్తుతం పాక్ ను వారి గడ్డపైనే చిత్తుగా ఓడించి.. ప్రపంచ క్రికెట్ దేశాలకు సవాల్ విసురుతోంది. ఇక త్వరలోనే భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంటామని ధీమాను కూడా వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీమిండియా సైతం బంగ్లాను తక్కువ అంచనా వేయడం లేదు. గట్టి టీమ్ గానే భావించి.. అందుకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇలాంటి సమయంలో జియో సినిమాతో మాట్లాడిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

“దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఇక చాలా మంది మేము బంగ్లాదేశ్ సిరీస్ ను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి రిహార్సల్స్ అనుకుంటున్నాము అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. పైగా మేము బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఆ జట్టు అద్భుతంగా ఆడుతుంది. అయితే.. ఆ టీమ్ ను ఓడించడానికి మా ప్లాన్స్ మాకున్నాయి. అన్ని రకాల వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తాం. దీంతో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో లో సాధించాల్సిన పాయింట్లు ఉన్నాయి. అందుకే ఈ సీజన్ ను ఘనంగా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం” అని ఒక విధంగా బంగ్లాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు హిట్ మ్యాన్. కాగా.. సెప్టెంబర్ 19 నుంచి చెపాక్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు ఎండలో చమటలు కక్కుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీన్ని బట్టే అర్థం అవుతుంది బంగ్లాను టీమిండియా అంత ఈజీగా తీసుకోట్లేదని. మరి తొలి టెస్ట్ కు ముందు బంగ్లాదేశ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.