Nidhan
టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. జట్టుకు వరుస విజయాలు అందిస్తూ తిరుగులేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు.
టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. జట్టుకు వరుస విజయాలు అందిస్తూ తిరుగులేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు.
Nidhan
భారత జట్టుకు ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు సారథ్యం వహించారు. అయితే వారిలో బెస్ట్ కెప్టెన్ ఎవరంటే మాత్రం ముగ్గురు, నలుగురు మాత్రమే గుర్తుకొస్తారు. మొదటిసారి టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్, జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ బెస్ట్ కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరితో పాటు టీమ్‌కు దూకుడు నేర్పిన కోల్‌కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ, అదే అటాకింగ్ అప్రోచ్‌తో ముందుకెళ్లిన విరాట్ కోహ్లీ మంచి సారథులుగా గుర్తింపు సంపాదించారు. విజయాలు, రికార్డుల పరంగా చూసుకుంటే ధోనీనే బెస్ట్ కెప్టెన్ అని అనొచ్చు. అయితే ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కూడా అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కప్పు చేజారినా అతడి సారథ్యం అందర్నీ ఆకట్టుకుంది. అలాంటి రోహిత్ కెప్టెన్సీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కెప్టెన్సీ ఏమంత ఈజీ కాదన్నాడు రోహిత్ శర్మ. సారథిగా సక్సెస్ అవడం అంటే మ్యాచుల్లో నెగ్గడం, ట్రోఫీలు సాధించడం మాత్రమే కాదని మరికొన్ని కఠినమైన సవాళ్లను దాటాల్సి ఉంటుందన్నాడు. జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడం అన్నింటి కంటే బిగ్ ఛాలెంజ్ అన్నాడు హిట్‌మ్యాన్. వారిని ప్రతి సవాల్ కోసం సిద్ధం చేయడం కూడా చాలా ముఖ్యమని తెలిపాడు. ‘ఒక లీడర్‌గా టీమ్‌మేట్స్‌లో నమ్మకం కలిగించడం నా బాధ్యత. అలాగే జట్టులో వారి పాత్రతో సంబంధం లేకుండా టీమ్‌కు వాళ్లు ఎంత ముఖ్యమనేది వివరంగా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. అందుకే ప్రతి ఆటగాడితో పర్సనల్‌గా ఇంటరాక్ట్ అవుతా. వాళ్లు చెప్పేది వినడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటా. జట్టులో వాళ్ల చోటు గురించి నమ్మకాన్ని కలిగిస్తా. ఆటగాళ్లలో విశ్వాసాన్ని కలిగించడం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు తగ్గట్లుగా వారిని సిద్ధం చేయడం చాలా కష్టమైన పని’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ప్రతి మ్యాచ్‌లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఎదురవుతాయని.. వాటికి తగ్గట్లు జట్టులోని ప్లేయర్లను ప్రిపేర్ చేయడం అంత ఈజీ కాదన్నాడు రోహిత్. కెప్టెన్సీ గురించి హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సారథ్యం గురించి ఇన్ని విషయాలు తెలుసు, ఆచరిస్తున్నాడు కాబట్టే అటు ఐపీఎల్‌తో పాటు ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ ఇంతగా సక్సెస్ అవుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. రోహిత్ మరికొన్నేళ్లు ఇలాగే బ్యాట్‌తో రాణించడంతో పాటు కెప్టెన్సీలో అదరగొడితే భారత్ మరిన్ని విజయాలు సాధిస్తుందని చెబుతున్నారు. ఎలాగూ వన్డే వరల్డ్ కప్ మిస్సయింది.. టీ20 ప్రపంచ కప్‌ను మాత్రం చేజార్చుకోవద్దని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత్‌కు రోహిత్ ఐసీసీ కప్పును అందిస్తాడనే నమ్మకం తమకు ఉందని చెబుతున్నారు. మరి.. కెప్టెన్సీపై హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Alana King: వీడియో: నో బాల్‌కు సిక్స్, హిట్ వికెట్.. ఈ బ్యాటర్ ఔటా? నాటౌటా?
Rohit Sharma said “As a Leader, it’s crucial to instill confidence in players & make them feel valued regardless of their role in the team”. [ANI] pic.twitter.com/REAt9x3Q9M
— Johns. (@CricCrazyJohns) February 10, 2024