Rohit Sharma: లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న రోహిత్.. అతడి సొంత తమ్ముడు మాత్రం..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్న ఈ స్టార్ ప్లేయర్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అతడి సొంత తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో చాలా మందికి తెలియదు. హిట్​మ్యాన్ సోదరుడి సిచ్యువేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్న ఈ స్టార్ ప్లేయర్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అతడి సొంత తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో చాలా మందికి తెలియదు. హిట్​మ్యాన్ సోదరుడి సిచ్యువేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్​ రిచ్ పీపుల్ గేమ్​గా మారిపోయింది. క్లబ్ స్టేజ్ నుంచి నేషనల్ టీమ్​ వరకు జర్నీ చేయాలంటే ఎన్నో టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. ఏళ్ల పాటు కిట్​ దగ్గర నుంచి కోచింగ్ ఫీజులు, ప్రయాణ ఖర్చుల వరకు ఎన్నింటినో భరించాల్సి ఉంటుంది. చిన్న టోర్నమెంట్​లో పార్టిసిపేట్ చేయాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటిది ఏళ్ల పాటు ఓపిగ్గా ఆడుతూ అత్యున్నత దశకు చేరుకోవాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోతే సాధ్యం కాదు. కానీ కొందరు క్రికెటర్లు మాత్రం పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చి కూడా తమ కలల్ని నెరవేర్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకడు ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియాను లీడ్ చేసే రేంజ్​కు ఎదిగాడు. కోట్ల రూపాయలు ఆర్జిస్తూ లగ్జరీ లైఫ్​ లీడ్ చేస్తున్నాడు. అయితే అతడికి ఒక తమ్ముడు ఉన్నాడనేది చాలా మందికి తెలియదు. హిట్​మ్యాన్ సోదరుడి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

పేదరికాన్ని జయించిన రోహిత్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న హిట్​మ్యాన్ తన భార్య రతికా సజ్దే, కూతురు సమైరా శర్మతో కలసి ఉంటున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు, తోడబుట్టిన తమ్ముడి గురించి చాలా మందికి తెలియదు. రోహిత్ తండ్రి పేరు గురునాథ్ శర్మ. అతడి తల్లి పేరు పూర్ణిమా శర్మ. ఆమె సొంతూరు విశాఖపట్నం. ఈ దంపతులకు 1987 ఏప్రిల్ 30వ తేదీన రోహిత్ పుట్టాడు. ఆ తర్వాత మరో కుమారుడు జన్మించగా.. అతడికి విశాల్ శర్మ అని పేరు పెట్టారు. హిట్​మ్యాన్ మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో పుట్టాడు. అతడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ డోంబివలీ ప్రాంతానికి షిఫ్ట్ అయింది. అయితే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆదాయం సరిపోకపోవడంతో గురునాథ్​ శర్మ రోహిత్​ను అతడి బామ్మతాతయ్యల దగ్గరకు పంపేశారు. హిట్​మ్యాన్​లోని క్రికెటింగ్ టాలెంట్​ను గుర్తించిన అతడి అంకుల్.. ఒక క్యాంప్​లో చేర్పించాడు.

14వ ఏట క్రికెట్​ క్యాంప్​లో జాయిన అయిన రోహిత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాలో కీలక బ్యాటర్​గా.. ఆ తర్వాత కెప్టెన్​గా మారాడు. భారత జట్టుతో పాటు ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ తరఫున ఆడుతూ బాగా సంపాదించాడు. అలాగే యాడ్స్​ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వెనకేసుకున్నాడు. అయితే ఎంత సంపాదించినా తన కుటుంబాన్ని మాత్రం అతడు వదల్లేదు. తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యతల్ని తమ్ముడు విశాల్​కు అప్పగించాడు. ఇండియాతో పాటు సింగపూర్​లో ఉన్న రోహిత్ క్రిక్​కింగ్​డమ్ అకాడమీ ఆపరేషన్స్​కు విశాల్ హెడ్​గా ఉన్నాడు. దీపాళి షిండే అనే అమ్మాయితో విశాల్​కు మ్యారేజ్ అయింది. వీళ్లకు అనైరా, అనైషా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హిట్​మ్యాన్ ఎంత ఎత్తుకు ఎదిగినా తన కుటుంబ బాధ్యతల్ని మరువకపోవడం, తమ్ముడికి అన్ని విధాలుగా దన్నుగా నిలవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. రోహిత్ తన కుటుంబ బాధ్యతల్ని మరవకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Muhammad Riswan: సరదాగా చేసిన రీల్‌.. ప్రపంచ రికార్డు తెచ్చిపెట్టింది!

Show comments