రోహిత్ అరుదైన ఘనత.. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

రోహిత్ అరుదైన ఘనత.. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ విధ్వంసకర వీరుడు, మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ విధ్వంసకర వీరుడు, మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు బౌలింగ్ లో అదరగొట్టిన భారత్ ఆటగాళ్లు.. రెండో రోజు బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ విధ్వంసకర వీరుడు, మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో కదంతొక్కాడు. శుబ్ మన్ గిల్ తో కలిసి రెండో వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో వంద పరుగులు చేశాడు. ఇక రోహిత్ కెరీర్ లో ఓవరాల్ గా ఇది 48వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ లో మెుత్తంగా 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సులతో 103 రన్స్ చేసి స్టోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక ఈ సెంచరీతో పలు అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్(42) ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ కు ఇది ఓపెనర్ గా 43వ సెంచరీ కావడం విశేషం.

కాగా.. ఈ లిస్ట్ లో డేవిడ్ వార్నర్ 49 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఘనతతో పాటుగా ఇంటర్నేషనల్ కెరీర్ లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఇండియన్ ప్లేయర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(48) సెంచరీల రికార్డును సమం చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఇంగ్లండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్, దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. గవాస్కర్ ఇంగ్లండ్ పై 4 సెంచరీలు చేయగా.. రోహిత్ సైతం 4 శతకాలు బాదాడు. రోహిత్ శర్మ సాధించిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: 15 ఏళ్ల కెరీర్.. ఆడింది రెండు టెస్టులే! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

Show comments