iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మ అర్థరాత్రి లేపేవాడు! ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పిన చావ్లా!

  • Published Sep 14, 2024 | 9:11 AM Updated Updated Sep 14, 2024 | 9:11 AM

Piyush Chawla about Rohit Sharma: రోహిత్ శర్మపై పొగడ్తల వర్షం కురిపించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా రోహిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

Piyush Chawla about Rohit Sharma: రోహిత్ శర్మపై పొగడ్తల వర్షం కురిపించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా రోహిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ అర్థరాత్రి లేపేవాడు! ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పిన చావ్లా!

టీమిండియా కెెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా.. రోహిత్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నాడు. అలాగే అతడో అసాధారణమైన నాయకుడని, జట్టు విజయం సాధించడానికి ఎల్లప్పడు పరితపించే వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. ఇక తనను ఓ రోజు అర్థరాత్రి లేపాడని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

రోహిత్ శర్మపై పొగడ్తల వర్షం కురిపించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా రోహిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. చావ్లా మాట్లాడుతూ..”రోహిత్ శర్మతో కలిసి నేను ఎన్నో మ్యాచ్ లు ఆడాను. అయితే గ్రౌండ్ బయటకూడా మేమిద్దరం మాట్లాడుకుంటాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఓ సారి అర్థరాత్రి 2.30 గంటలకు మెసేజ్ చేశాడు. ఆ టైమ్ కు నేను నిద్రపోతున్నానా? లేదా? అని తెలుసుకున్నాడు. నిద్రపోకపోతే.. బయటకి రావాలని అన్నాడు. నేను బయటకి వెళ్లగానే ఓ పేపర్ తీసుకుని దానిపై ఫీల్డ్ ను గీసి, దాంట్లో డేవిడ్ వార్నర్ ను ఎలా అవుట్ చేయాలో ప్లాన్ ను వివరించాడు. ఇద్దరం కలిసి దానిపై చర్చించాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రోహిత్ శర్మ ఓ అద్భుతమైన నాయకుడు అంటూ చావ్లా ప్రశంసించాడు. అతడు మిగతా ప్లేయర్లకు స్వేచ్ఛగా ఆడుకునే వెసులుబాటు కల్పిస్తాడని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసేందుకు ఏ టైమ్ లో అయిన బౌలర్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. బౌలర్లతో కలిసి వ్యూహాలు రచించడం హిట్ మ్యాన్ కు అలవాటని, దానికోసం టైమ్ కూడా చూసుకోడని చావ్లా పేర్కొన్నాడు. కాగా.. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ ఆడిన తీరు అద్బుతమని, అతడు అలా ఆడటంతోనే మిగతా ప్లేయర్లు ఫ్రీగా ఆడారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక గత కొంత కాలంగా పియూష్ చావ్లా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన పియూష్ చావ్లాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.