SNP
Virat Kohli, Rohit Sharma, Sachin Tendulkar, MS Dhoni Batting Weakness: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప గొప్ప బ్యాటర్లుగా పేరొందిన స్టార్ క్రికెటర్ల బ్యాటింగ్ వీక్‌నెస్, ఇబ్బంది పడే షాట్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Virat Kohli, Rohit Sharma, Sachin Tendulkar, MS Dhoni Batting Weakness: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప గొప్ప బ్యాటర్లుగా పేరొందిన స్టార్ క్రికెటర్ల బ్యాటింగ్ వీక్‌నెస్, ఇబ్బంది పడే షాట్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో గొప్ప గొప్ప బ్యాటర్లుగా పేరు గడించిన ఎంతో మంది స్టార్లు మన ఇండియన్ టీమ్ నుంచే వచ్చారు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ది వాల్ రాహుల్ ద్రవిడ్, నవాబ్ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, కింగ్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఇలా గొప్ప గొప్ప బ్యాటర్లంతా టీమిండియా నుంచే ఉద్భవించారు. ఈ స్టార్ క్రికెటర్ల ఆటకు ఫిదా అయిన వాళ్లు కోట్ల మంది ఉన్నారు. టన్నుల కొద్ది పరుగులు సాధించి, ఎంతో మంది బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఈ స్టార్ క్రికెటర్లందరికీ వారికంటూ ఓ ట్రేడ్ మార్క్ షాట్ ఉంది. సచిన్ పేరు చెప్పగానే స్ట్రైట్ డ్రైవ్, కోహ్లీ పేరు వినగానే కవర్ డ్రైవ్ షాట్లు గుర్తుకు వస్తాయి. ఇవి అందరికీ తెలిసిందే.. కానీ, వాళ్లు సరిగ్గా ఆడలేని షాట్లు, బ్యాటింగ్‌లో వాళ్ల వీక్‌నెస్ గురించి బహుషా చాలా మందికి తెలిసి ఉండదు.. మరి ఇండియన్ క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్లుగా ఉన్న కొంతమంది ఆటగాళ్ల వీక్‌నెస్ ఏంటి? బ్యాటింగ్ చేస్తూ ఏ షాట్ ఆడేందుకు ఇబ్బంది పడతారు? ఏ షాట్ సరిగ్గా ఆడలేరో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోడ్రన్ క్రికెట్‌లో ఇప్పటికే లెజెండ్ అయిపోయాడు. వన్డే క్రికెట్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో మరే క్రికెటర్‌కు సాధ్యం కానీ విధంగా.. 50 సెంచరీలు సాధించాడు. అలాగే టెస్టు, టీ20ల్లోనూ గొప్ప బ్యాటర్‌గా ఉన్నాడు. కవర్ డ్రైవ్‌ను ఎంతో అద్భుతంగా ఆడగలడు. కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడితే.. ఆ షాట్‌కే అందం వస్తుంది. అలాంటి కోహ్లీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలవరీ అవుట్ స్వింగ్ అవుతుంటే మాత్రం ఇబ్బంది పడతాడు. అలాగే పుల్ షాట్‌ను కూడా సరిగ్గా ఆడలేడు. ఇది విరాట్ కోహ్లీకి ఉన్న చిన్న వీక్‌నెస్. అందుకే కోహ్లీని అవుట్ చేసేందుకు చాలా మంది బౌలర్లు.. అవుట్ స్వింగర్లు, షార్ట్ పిచ్ బంతులను ఎక్కువగా వేస్తుంటారు. ఇవి తప్పితే కోహ్లీకి వంకపెట్టడానికి ఇంకేమి లేదు.
టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మోడ్రన్ గ్రేట్స్‌లో ఒకడు. విరాట్ కోహ్లీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ స్టార్టింగ్‌లో లోయర్ ఆర్డర్, మిడిల్డార్‌లో బ్యాటింగ్ చేస్తూ.. అంతగా రాణించలేదు. కానీ, ఒక్కసారి ఓపెనర్ అయిన తర్వాత రోహిత్ రేంజ్ మారిపోయింది. భారీ భారీ ఇన్నింగ్స్‌లతో గొప్ప బ్యాటర్‌గా ఎదిగాడు. వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా.. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 264 పరుగులు చేశాడు. వన్డే హిస్టరీలో అదే అత్యధిక స్కోర్. రోహిత్ శర్మ పుల్‌షాట్‌ను అద్భుతంగా ఆడతాడు.. కానీ, ఫ్రంట్‌ఫుట్ షాట్ సరిగ్గా ఆడలేడనే విమర్శలు ఉన్నాయి. దీనిని రోహిత్ బ్యాటింగ్ వీక్‌నెస్‌గా చెప్పుకోవచ్చు.
మహేంద్ర సింగ్ ధోని.. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోతాడు. అలాగే ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అతనే. కెప్టెన్‌గానే కాక, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా, ఫినిషర్‌గా ధోని భారత జట్టులో ఎన్నో పాత్రలను సమర్థవంతంగా పోషించాడు. క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ వినని ది హెలికాప్టర్ షాట్‌ను కనిపెట్టాడు. అలాంటి ధోని.. ఆఫ్ సైడ్ షాట్లు ఆడేందుకు, పుల్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడతాడు. అయితే.. ధోని ఎక్కువ డౌన్‌ది ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కి రావడంతో.. రిస్క్‌తో కూడిన అగ్రెసివ్ షాట్లతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. అందుకే ప్రతి బాల్‌కు మ్యాగ్జిమమ్ రన్స్ చేయాలని షాట్లు ఆడేవాడు.
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. రెండు వరల్డ్ కప్‌లు గెలిపించిన ప్లేయర్‌గా అతన్ని భారత క్రికెట్ అభిమాన లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతనే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కీ ప్లేయర్‌గా ఉండేవాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కొట్టిన 6 సిక్సులకు.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో స్పెషల్ పేజీలు ఉంటాయి. అలాంటి ఆటగాడికి కూడా ఓ వీక్‌నెస్ ఉంది. సాధారణంగానే యువీ స్పిన్నర్లను సరిగ్గా ఆడలేడు. అందులోనా స్వీప్ షాట్ ఆడేందుకు బాగా ఇబ్బంది పడుతుంటాడు. అలా ఇబ్బంది పడుతూ అనేక సార్లు అవుట్ అయ్యాడు.
విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు వీరేందర్ సెహ్వాగ్. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, ఏ పిచ్ అయినా.. ఒకేలా బ్యాటింగ్ చేయగల దమ్మున్నోడు. నిలబడ్డాడంటే.. అతని విధ్వంసానికి అడ్డు అదుపు ఉండుదు. 99, 199, 299 వ్యక్తిగత స్కోర్ వద్ద కూడా సిక్స్ కొట్టే గట్స్ ఒక్క వీరుగా ఉండేవి. అసలు స్పిన్నర్లు తన దృష్టిలో బౌలర్లే కాదు అని చెప్పే మొండితనం అతని సొంతం. అలాంటి సెహ్వాగ్‌కు సరైన ఫుట్ వర్క్ ఉందనే విమర్శలు ఉన్నాయి. నిలబడిన చోటు నుంచే షాట్లు ఆడే ప్లేయర్. కాళ్లు కదిపి.. ఫుట్ వర్క్‌తో బాల్‌ను టైమ్ చేయలేడు. అందుకే లెగ్ స్టంప్ వైపు జరిగి ఆడటంలో సెహ్వాగ్ చాలా ఇబ్బంది పడతాడు. ఇది అతని వీక్‌నెస్‌గా చెప్పుకోవచ్చు.
గాడ్ ఆఫ్ ది క్రికెట్.. సచిన్ రమేష్ టెండూల్కర్‌కి కూడా వీక్‌నెస్ ఉందంటే.. బహుషా ఈ ప్రపంచం ఒప్పుకోకపోవచ్చు. కానీ, కొన్ని నిజాలు కఠినంగా ఉన్నా.. నమ్మాల్సిందే. క్రికెట్ దేవుడు సచిన్ టెండ్కూలర్ స్ట్రైట్ డ్రైవ్ ఆడితే స్కెల్ పెట్టి లైన్ గీసినట్టు ఉంటుంది. అలాగే అప్పర్ కట్ కూడా ఎంతో అద్భుతంగా ఆడతాడు. అసలు సచిన్ ఏ షాట్ ఆడినా ఆ షాట్‌కే అందం వస్తుంది. అలాంటి సచిన్ కొన్ని సార్లు కవర్ డ్రైవ్ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒక్క కవర్ డ్రైవ్ ఆడకుండా ఏకంగా 241 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ సిరీస్‌లో అంతకంటే ముందు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బంతులను కవర్ డ్రైవ్‌లోకి ఆడుతూ వికెట్ సమర్పించుకున్నాడు. అందుకే సచిన్ కవర్ డ్రైవ్ సరిగ్గా ఆడలేడనే విమర్శలు ఉన్నాయి.
భారత క్రికెట్ తలరాతను మార్చిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే.. గంగూలీ కెప్టెన్సీ కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. భారత క్రికెట్‌పై అంతలా తన ముద్ర వేశాడు దాదా. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి సీనియర్లను కలుపుకుంటూ పోతూనే.. సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, మొహమ్మద్ కైఫ్, ధోని లాంటి స్టార్లను భారత క్రికెట్‌కు అందించిన గొప్ప కెప్టెన్ అతను. కెప్టెన్‌గానే కాదు.. బ్యాటర్‌గా కూడా గంగూలీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్‌కు పోటీ ఇవ్వడమే కాదు సచిన్‌ను దాటిపోయాడు. దాదాను గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అని కూడా అంటారు. అలాంటి గంగూలీ.. పుల్ షాట్ ఆడేందుకు కాస్త ఇబ్బంది పడతాడు. ఇది అతనికున్న వీక్‌నెస్‌గా చెప్పుకోవచ్చు. మరి ఈ స్టార్లకు ఉన్న వీక్‌నెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.