SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ.. బౌలర్ల కష్టానికి ఫలితం చూపిస్తూ.. మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఒకే తప్పును రిపీట్ చేస్తూ భారత బ్యటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ.. బౌలర్ల కష్టానికి ఫలితం చూపిస్తూ.. మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఒకే తప్పును రిపీట్ చేస్తూ భారత బ్యటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. గురువారం తొలి రోజు ఇంగ్లండ్‌ను కేవలం 246 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగి.. ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి తొలి రోజు ఆటను సంతృప్తికరంగా ముగించింది. రెండో రోజు కూడా అదే డామినేషన్‌ను చూపిస్తోంది టీమిండియా. తొలి రోజు హాఫ్ సెంచరీతో సత్తా చాటిన జైస్వాల్.. ఆట రెండో రోజు 80 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ సైతం అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే.. తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లంతా పర్వాలేదనిస్తున్నా.. ఒక్క తప్పు చేస్తూ వికెట్లు పారేసుకుంటున్నారు. అదే ఇప్పుడు ఇంగ్లండ్‌కు వరంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరకు టీమిండియా కోల్పోయిన వికెట్లను పరిశీలిస్తే.. కేవలం ఒకే ఒక్క తప్పుతోనే కోల్పోయింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 23 పరుగులు చేసి.. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్స్ కోసం ప్రయత్నించి బెన్‌స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలాగే మరో ఓపెనర్ యశస్వి జేస్వాల్ సైతం ఫోర్ కోసం ప్రయత్నించి.. ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో జో రూట్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శుబ్‌మన్ గిల్ నిదానంగానే ఆడినా.. ఇతను కూడా ఫోర్ కొట్టే క్రమంలోనే వికెట్ పారేసుకున్నాడు. ఇన్నింగ్స 35వ ఓవర్‌లో కొత్త బౌలర్ టాప్ హార్ట్లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి కాస్త అగ్రెసివ్‌గానే ఆడుతున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు సైతం భారీ షాట్లకు ప్రయత్నించే వికెట్ పారేసుకున్నారు. ముందుగా అయ్యర్ ఇన్నింగ్స్ 53వ ఓవర్‌లో రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో టామ్ హార్ట్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక సెంచరీకి చేరువ అవుతున్న క్రమంలో కేఎల్ రాహుల్ మరీ ఎక్కువ అగ్రెసివ్ బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికే రెండు భారీ సిక్సులు కొట్టి జోరుమీదున్న రాహుల్.. సిక్స్ కోసమే ప్రయత్నించి వికెట్ ఇచ్చేశాడు. ఇన్నింగ్స్ 65వ ఓవర్‌లో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా టీమిండియా కోల్పోయిన ఐదు వికెట్లు కూడా అగ్రెసివ్ క్రికెట్ ఆడే క్రమంలోనే కోల్పోయింది.
ఈ ఐదు వికెట్లలో ఒక్క వికెట్‌లో కూడా ఇంగ్లండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఆటగాళ్లు అగ్రెసివ్ షాట్లు ఆడటంతోనే వికెట్లు పడ్డాయి. అలా కాకుండా కాస్త నిదానంగా ఆచీతూచీ ఆడి ఉంటే మాత్రం ఇంగ్లండ్‌కు వికెట్లు దొరకడం నిజంగా కష్టమయ్యేది. మరి మనోళ్లు ఎందుకు అలా షాట్లుకు ప్రయత్నించి అవుట్ అయ్యారో అర్థం కావడం లేదు. అవి మరీ అంత చెత్త షాట్లు కూడా కాదు. కానీ, దురదృష్టవశాత్తు వాళ్లు ఆశించిన ఫలితం రాలేదు. అదే ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. భారత క్రికెటర్లు ఆడిన అగ్రెసివ్ క్రికెట్‌తోనే వారికి ఐదు వికెట్లు దక్కాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Rohit got out while going for a six.
– Jaiswal got out while going for a four.
– Gill got out while going for a four.
– Iyer got out while going for a six.
– KL Rahul got out while going for a six. pic.twitter.com/e0VMWxureY— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2024