భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మీద సీనియర్ క్రికెటర్ అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మీద సీనియర్ క్రికెటర్ అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆల్‌రౌండర్స్ సమస్య టీమిండియాను ఎప్పుడూ వేధిస్తూ వస్తోంది. ముఖ్యంగా పేస్ ఆల్‌రౌండర్ దొరకడం అనేది మనకు కష్టంగా మారుతోంది. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే, సుదీర్ఘ కాలం సేవలు అందించే ప్లేయర్ మనకు దొరకలేదు. మధ్యలో ఇర్ఫాన్ పఠాన్ రూపంలో ఓ ఆల్‌రౌండర్ వచ్చాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడమే గాక బ్యాట్‌తో భారీ షాట్లు బాదుతూ ఓ మంచి ఆప్షన్లా కనిపించాడు పఠాన్. కానీ టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చిన ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ అతడి కెరీర్‌ను నాశనం చేశాడు. బ్యాటింగ్‌లో లోయరార్డర్లో దిగే పఠాన్‌ను ఓపెనర్‌గా పంపాడు. దీంతో బ్యాటింగ్‌లో ఫెయిలైన ఇర్ఫాన్.. అటు గాయాల వల్ల బౌలింగ్ స్పీడ్ తగ్గడం, రిథమ్ కోల్పోవడంతో టీమిండియాకు దూరమయ్యాడు.
పఠాన్ తర్వాత ఆల్‌రౌండర్ రోల్ కోసం చాలా ఆప్షన్లను ప్రయోగించింది బీసీసీఐ. అయితే ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత హార్దిక్ పాండ్యా రూపంలో మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. గత కొన్నేళ్లుగా అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు పాండ్యా. బ్యాటింగ్‌లో లాస్ట్‌లో వచ్చి మ్యాచ్‌లు ఫినిష్ చేస్తున్నాడు. బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు వేసి అవసరమైన బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. రీసెంట్గా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లోనూ అతడు ఆకట్టుకున్నాడు. అయితే నాకౌట్‌కు చాలా ముందే అతడు టీమ్‌కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వేసిన టైమ్‌లో గాయపడ్డాడు. బ్యాటర్ కొట్టిన బాల్‌ను ఆపే క్రమంలో అతడు తన కాలును స్ట్రెచ్ చేయడంతో ఇంజ్యురీ అయింది. ఈ గాయం నుంచి కోలుకునేందుకు ఎక్కువ టైమ్ పట్టేలా ఉండటంతో అతడ్ని వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి తప్పించారు.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రికవరీ అవుతున్నాడు పాండ్యా. గాయం కారణంగా త్వరలో మొదలయ్యే సౌతాఫ్రికా టూర్‌కు కూడా దూరమయ్యాడు. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హార్దిక్ అప్పటివరకు పూర్తి ఫిట్‌గా ఉండటం, ఫామ్‌ను దొరకబుచ్చుకోవడం చాలా ముఖ్యం. టీ20 టీమ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దికే కాబట్టి అతడు కోలుకోవడం భారత్‌కు కీలకం కానుంది. 2018 నుంచి గాయాలతో ఇబ్బంది పడుతున్న పాండ్యా వీటి నుంచి ఎప్పుడు పూర్తిగా రికవర్ అవుతాడో చూడాలి. ఇదిలా ఉంటే.. పాండ్యాపై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా సెటైర్స్ వేశాడు.
హార్దిక్ ఓ అరుదైన టాలెంట్ ఉన్న ప్లేయర్ అని చెప్పిన అజయ్ జడేజా.. అతడు గ్రౌండ్లో ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడని వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ‘దీని అర్థం ఏంటో మీకు తెలీదు. అతడు అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడు. గ్రౌండ్లో కూడా అంతే అరుదుగా కనిపిస్తాడు’ అని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాడు అజయ్ జడేజా. దీనిపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ఫీల్డ్‌లో కంటే బయట పార్టీలు, సెలబ్రేషన్స్‌లోనే పాండ్యా ఎక్కువగా కనిపిస్తాడని అజయ్ చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా అన్నింటికీ చెక్ పెట్టి క్రికెట్‌పై ఫుల్ ఫోకస్ చేయాలనే ఉద్దశంతోనే జడేజా అలా అన్నాడని చెబుతున్నారు. కాగా, రీసెంట్గా ముగిసిన వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌కు అజయ్ జడేజా మెంటార్‌గా పనిచేసి సంగతి తెలిసిందే. మరి.. హార్దిక్ పాండ్యాను అజయ్ జడేజా ఏకిపారేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Mushfiqur Rahim: క్రికెట్లో మరో కాంట్రవర్షియల్ ఔట్.. ముష్ఫికర్ చేతులారా..!
Ajay Jadeja takes a dig at Hardik Pandya#AjayJadeja #HardikPandya #IndianCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/gfTP3q8uqU
— InsideSport (@InsideSportIND) December 5, 2023