iDreamPost
android-app
ios-app

CSK బౌలర్ ఊచకోత.. 78 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు రిపీట్!

Tanush Kotian, Tushar Deshpande: 78 ఏళ్ళ డొమెస్టిక్ క్రికెట్ హిస్టరీలో సంచలనం రికార్డు నెలకొల్పారు ముంబై బౌలర్లు తనీష్ కోటియన్, తుషార్ పాండే జోడీ.

Tanush Kotian, Tushar Deshpande: 78 ఏళ్ళ డొమెస్టిక్ క్రికెట్ హిస్టరీలో సంచలనం రికార్డు నెలకొల్పారు ముంబై బౌలర్లు తనీష్ కోటియన్, తుషార్ పాండే జోడీ.

CSK బౌలర్ ఊచకోత.. 78 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు రిపీట్!

టెస్ట్ క్రికెట్.. సంప్రదాయ క్రికెట్ గా పేరుగాంచిన ఈ ఫార్మాట్ రాను రాను తన ఉనికిని కోల్పోతోందని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ యువ క్రికెటర్లు మాత్రం ఈ ఫార్మాట్ కు ప్రాణం పోయాలని చూస్తున్నారు. అందుకోసం తమ శక్తిమేరకు రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. 78 ఏళ్ళ డొమెస్టిక్ క్రికెట్ హిస్టరీలో సంచలనం రికార్డు నెలకొల్పారు ముంబై బౌలర్లు తనీష్ కోటియన్, తుషార్ పాండే జోడీ.

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ లో సంచలన రికార్డు నమోదైంది. ఈ సీజన్ లో భాగంగా బీకేసీ అకాడమీ వేదికగా జరుగుతున్న రెండవ క్వర్టర్ ఫైనల్లో బరోడా వర్సెస్ ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో విధ్వంసం సృష్టించారు 10వ, 11వ నెంబర్ ఆటగాళ్లు. 10వ బ్యాటర్ గా క్రిజ్ లోకి వచ్చిన తనీష్ కోటియన్ 129 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 120 పరుగులు చేశాడు. అతడికి తోడు తుషార్ పాండే 129 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 123 రన్స్ చేశాడు. వీరిద్దరు 10వ వికెట్ కు 232 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో 78 సంవత్సరాల డొమెస్టిక్ క్రికెట్ చరిత్రలో 10వ వికెట్ కు నెలకొల్పిన భాగస్వామ్యాల్లో ఇది రెండోవదిగా నమోదైంది. ఇంతకు ముందు రంజీ ట్రోఫీలో అజయ్ శర్మ-మణిందర్ సింగ్ లు 233 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. ఒక్క పరుగుతేడాతే కొద్దిలో రికార్డు మిస్ అయ్యింది. తనీష్ కోటియన్-తుషార్ దేశ్ పాండే జోడీ భారీ భాగస్వామ్యంతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో 569 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో ముంబై తొలిఇన్నింగ్స్ ఆధిక్యం 36 పరుగులతో కలిపి 606 పరుగుల లక్ష్యాన్ని బరోడా ముందు ఉంచింది. ముంబై తొలి ఇన్నింగ్స్ లో 384, బరోడా 348 పరుగులు చేశాయి. కాగా.. తుషార్ దేశ్ పాండే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి 78 ఏళ్ల డొమెస్టిక్ క్రికెట్ లో తర్వాత ఇలా చివరి వికెట్ కు 232 పరుగులు జోడించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇంగ్లండ్ తో చివరి టెస్ట్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి