iDreamPost

ఇంగ్లండ్ తో చివరి టెస్ట్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

Rohit Sharma: ఇంగ్లండ్ తో జరగబోయే చివరి టెస్ట్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం.

Rohit Sharma: ఇంగ్లండ్ తో జరగబోయే చివరి టెస్ట్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం.

ఇంగ్లండ్ తో చివరి టెస్ట్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

టీమిండియా ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ ను ఇంకో టెస్ట్ మిగిలుండగానే కైవసం చేసుకుని సత్తాచాటింది. దీంతో స్వదేశంలో వరుసగా 17 సిరీస్ లను కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. ఇక చివరి నామమాత్రపు టెస్ట్ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ డెసిషన్ ఏంటో తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. ఆద్బుతమైన ఆటతీరుతోనే కాదు, అంతకంటే అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందిస్తూ వస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ నెగ్గి మరోసారి అందరిచేత హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు. అయితే చివరి మ్యాచ్ కోసం రోహిత్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎలాగో సిరీస్ గెలిచాం కాబట్టి.. లాస్ట్ మ్యాచ్ కు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడట రోహిత్. దీంతో ఈ టెస్టుకు కెప్టెన్ గా వెటరన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కెప్టెన్ పగ్గాలు అప్పగించనున్నారట. అశ్విన్ తన కెరీర్ లో వందో టెస్ట్ ఆడబోతున్నాడు. ఇంగ్లండ్ తో జరగబోయే చివరి మ్యాచ్ ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించబోతున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన 14వ ఇండియన్ ప్లేయర్ గా నిలవనున్నాడు.

అదీకాక రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుని, అశ్విన్ కు పగ్గాలు అందిస్తే.. వందో టెస్ట్ లో సారథిగా చేసిన ప్లేయర్ గా మరో ఘనతను కూడా ఇతడు తన ఖాతాలో వేసుకుంటాడు. మరోవైపు నాలుగో టెస్ట్ కు దూరమైన వైస్ కెప్టెన్, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చివరి మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. అయితే వందో టెస్ట్ ఆడనున్న అశ్విన్ కు గౌరవార్థం టీమిండియా మేనేజ్ మెంట్ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ కు విశ్రాంతి ఇస్తే.. దేవ్ దత్త్ పడిక్కల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇక అశ్విన్ తన కెరీర్ లో 99 టెస్టులు ఆడి 507 వికెట్లు తీయడంతో పాటుగా 3309 పరుగులు చేశాడు.

ఇదికూడా చదవండి: ఆస్పత్రి బెడ్ పై మహ్మద్ షమీ.. అసలేం జరిగింది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి