SNP
SNP
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి కల నెరవేర్చేందుకే క్రికెట్ ఆడినట్లు ప్రకటించాడు. తన శక్తి మేరకు ఆడాడని, ఆటలో రాణించేందుకు వంద శాతం ప్రయత్నించినట్లు తెలిపాడు. ఈ సమయంలో చాలా ఎమోషనలైన ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆటకు దూరం అవుతున్న ఆవేదన అని మాటలో, కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.
అయితే.. వన్డే ప్రపంచ కప్ ముందు బంగ్లా టీమ్‌కు షాకిస్తూ తమీమ్ ఇక్బాల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గతేడాదే టీ20లకు గుడ్‌బై చెప్పిన తమీమ్.. తాజాగా టెస్టు, వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు. బంగ్లాదేశ్ టీమ్‌లో ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇక్బాల్ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. వాటిలో 25 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో తమీమ్‌కు 15 వేలకు పైగా పరుగులు ఉండటం విశేషం.
Tamim Iqbal’s emotional message after making the decision to retire from international cricket. An icon for Bangladesh 👏 🏏 pic.twitter.com/syuNwPuCMy
— Sky Sports Cricket (@SkyCricket) July 7, 2023