Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.
Nidhan
క్రికెట్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లకు మంచి గిరాకీ ఉంటుంది. బ్యాటింగ్‌తో పాటు కొన్ని ఓవర్ల పాటు పేస్ బౌలింగ్ వేసి బ్రేక్ త్రూలు అందించే వారి కోసం అన్ని టీమ్స్ వెతుకులాడతాయి. వన్డేలు, టీ20లు, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్స్ ఉంటే టీమ్స్ పటిష్టంగా తయారవుతాయి. అయితే టీమిండియాలో మాత్రం వీరి కొరత ఎప్పటి నుంచో ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో మంచి ప్లేయర్ ఉన్నా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తుంటాడతను. దీంతో శార్దూల్ ఠాకూర్‌ను ఆ ప్లేస్‌కోసం టీమ్ చాలాసార్లు ఉపయోగించింది. అతడు కూడా కీలక వికెట్లు తీస్తూ, విలువైన రన్స్ జోడిస్తూ టీమ్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. మరోమారు సత్తా చాటాడు శార్దూల్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.
రంజీ ట్రోఫీ-2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న సెమీస్‌లో శార్దుల్ ఠాకూర్ (109) అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన టీమ్‌కు మంచి స్కోరు అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో 4 వికెట్లు తీసిన శార్దుల్.. బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టించాడు. 106 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైని ఒంటిచేత్తో గట్టెక్కించాడు. అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. 13 బౌండరీలు బాదిన శార్దుల్.. 4 భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. అతడికి తనుష్ కొటియన్ (89 నాటౌట్) మంచి సహకారం అందించాడు. చివర్లో తుషార్ దేశ్‌పాండే (26) కూడా బ్యాట్ ఝళిపించడంతో ముంబై 378 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ముంబై ఇన్నింగ్స్‌లో శార్దుల్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. టపటపా టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలడంతో క్రీజులోకి వచ్చిన అతడు.. టెయిలెండర్ల సహకారంతో తమిళనాడు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టేలా చేశాడు. ఈ క్రమంలో భారీ సిక్స్‌తో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. శతకం తర్వాత మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రెండు చేతులతో గాల్లోకి పంచ్‌లు విసురుతూ సాధించానంటూ అరించాడు. అంతటితో ఆగిపోలేదు శార్దుల్. అనంతరం బంతిని చేతబట్టి అపోజిషన్ టీమ్ బ్యాటర్ల పనిపట్టాడు. తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్ (5), నారాయణ్ జగదీసన్ (0)ను అతడు వెనక్కి పంపాడు. ఈ మ్యాచ్‌లో తమిళనాడు 175 పరుగులతో వెనుకబడి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముంబై ఫైనల్‌కు వెళ్లడం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది. మరి.. శార్దుల్ మెరుపు ఇన్నింగ్స్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
HUNDRED FOR SHARDUL THAKUR IN RANJI SEMI WHEN TEAM WERE 106/7 🫡
– The celebration was fire. 🔥pic.twitter.com/IubSed3uzF
— Johns. (@CricCrazyJohns) March 3, 2024
Shardul Thakur scored a century and picked two quick wickets. 🔥pic.twitter.com/PHr4dVud2h
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024