iDreamPost
android-app
ios-app

T20 వరల్డ్ కప్-2024 విజేతకు, రన్నరప్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంతంటే..?

  • Published Jun 03, 2024 | 6:51 PMUpdated Jun 03, 2024 | 7:09 PM

టీ20 వరల్డ్ కప్-2024 అద్భుతంగా సాగుతోంది. టోర్నీ తొలి రోజే ఓ మ్యాచ్ టై అయింది. రికార్డుల మీద రికార్డులతో మెగా టోర్నీ ఆడియెన్స్​ను ఊపేస్తోంది. ఈ తరుణంలో పొట్టి కప్పు నెగ్గే జట్టుకు ఎంత ప్రైజ్​మనీ దక్కుతుందని అందరూ మాట్లాడకుంటున్నారు. దీని మీద ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.

టీ20 వరల్డ్ కప్-2024 అద్భుతంగా సాగుతోంది. టోర్నీ తొలి రోజే ఓ మ్యాచ్ టై అయింది. రికార్డుల మీద రికార్డులతో మెగా టోర్నీ ఆడియెన్స్​ను ఊపేస్తోంది. ఈ తరుణంలో పొట్టి కప్పు నెగ్గే జట్టుకు ఎంత ప్రైజ్​మనీ దక్కుతుందని అందరూ మాట్లాడకుంటున్నారు. దీని మీద ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.

  • Published Jun 03, 2024 | 6:51 PMUpdated Jun 03, 2024 | 7:09 PM
T20 వరల్డ్ కప్-2024 విజేతకు, రన్నరప్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంతంటే..?

క్రికెట్ లవర్స్ ఫోకస్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్​-2024 వైపు మళ్లింది. మొన్నటి వరకు అంతా ఐపీఎల్-2024 బిజీలోనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్​లో స్టార్ ప్లేయర్లు, ఇండియన్ డొమెస్టిక్ ఆటగాళ్ల విన్యాసాలు చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మెగా టోర్నీ మొదలవడంతో అందరి దృష్టి ఇటు వైపు మళ్లింది. ఈసారి ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. పెద్ద టీమ్స్​తో పాటు చిన్న జట్లు కూడా ఢీ అంటే ఢీ అంటున్నాయి. టోర్నమెంట్ తొలి రోజే నమీబియా-ఒమన్ మ్యాచ్ టై అయింది. దీన్ని బట్టే ఈసారి మ్యాచులు ఎంత ఇంట్రెస్టింగ్​గా సాగనున్నాయో అర్థమవుతోంది. ఈ తరుణంలో మ్యాచులతో పాటు ప్రైజ్​మనీ గురించి కూడా అంతా చర్చించుకుంటున్నారు. విజేతకు, రన్నరప్​కు ఎంత ఇస్తారు? అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

పొట్టి వరల్డ్ కప్ ప్రైజ్​మనీపై తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన చేసింది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.20.36 కోట్లు ఇస్తామని ప్రకటించింది. రన్నరప్​గా నిలిచిన టీమ్​కు రూ.10.64 కోట్లు అందుతాయని వెల్లడించింది. అలాగే టోర్నమెంట్​లో పార్టిసిపేట్ చేసిన జట్లకు ప్రైజ్​మనీ అందించనుంది ఐసీసీ. సెమీస్​ చేరిన జట్లు, సూపర్​-8 వరకు వచ్చిన టీమ్స్.. ఇలా ఎవరి పెర్ఫార్మెన్స్​ను బట్టి ఆయా జట్లకు ప్రైజ్​మనీ అందనుంది. మొత్తంగా టీమ్స్​కు ప్రైజ్​మనీ రూపంలో ఐసీసీ ఏకంగా రూ.93.52 కోట్లను వెచ్చించనుంది.

ఇక, టీ20 వరల్డ్ కప్-2024 అద్భుతంగా సాగుతోంది. టోర్నీ తొలి రోజే మ్యాచ్ టై అయింది. రికార్డుల మీద రికార్డులు, టైతో మెగా టోర్నీ ఆడియెన్స్​ను ఊపేస్తోంది. మొదటి రోజు కెనడా మీద 7 వికెట్ల తేడాతో ఆతిథ్య అమెరికా ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్​లో ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్) అద్భుత బ్యాటింగ్​తో అలరించాడు. అతడు ఏకంగా 10 సిక్సులు కొట్టి క్రికెట్ లవర్స్​ అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. అమెరికా-కెనడా మ్యాచ్​ చూస్తుంటే పసికూనల్లా కాకుండా కాకలుదీరిన జట్టు కొట్లాడుకున్నట్లు అనిపించింది. ఈ మ్యాచే తోపు అనుకుంటే ఒమన్-నమీబియా మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్​లో నమీబియా నెగ్గింది. మరో మ్యాచ్​లో పసికూన పపువా న్యూగినియా మీద ఇంకో ఓవర్ ఉందనగా కష్టంగా గెలిచింది వెస్టిండీస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి