Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడం గిల్‌క్రిస్ట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఆ విషయంలో హిట్‌మ్యాన్‌ను మించినోడు లేడని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడం గిల్‌క్రిస్ట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఆ విషయంలో హిట్‌మ్యాన్‌ను మించినోడు లేడని చెప్పాడు.
Nidhan
టీమిండియా పంజా విసిరింది. డేంజరస్ సైడ్‌గా మారిన ఆఫ్ఘానిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. తమ పనైపోయింది, ఇక కష్టమేనని విమర్శించిన వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్-2024 సూపర్-8లో తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ సేన. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో వెస్టిండీస్ పిచ్‌లపై ఆడిన తొలి పోరులో విజయఢంకా మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో డామినేట్ చేస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. భారత్ జోరు ముందు ప్రత్యర్థి జట్టు ఏ దశలోనూ నిలబడలేకపోయింది. ఇది కదా తాము కోరుకుంది అని ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ చూశాక అభిమానులు అంటున్నారు.
నిన్నటి మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. స్లో పిచ్‌పై 150 పరుగులు చేస్తే గొప్ప అని అనుకుంటే.. టీమిండియా ఏకంగా 182 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53) స్పెషల్ నాక్‌తో తన విలువ ఏంటో చూపించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. బౌలర్లు అందరూ కనీసం ఒక్కో వికెట్ తీశారు. దీంతో ఆఫ్ఘాన్ 134 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్‌లో విఫలమైనా తన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. అపోజిషన్ టీమ్‌కు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో అతడిపై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ కూడా అతడ్ని మెచ్చుకున్నాడు.
రోహిత్ సారథ్యం సూపర్బ్ అని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ప్లానింగ్, స్ట్రాటజీ విషయంలో అతడ్ని మించినోడు ప్రస్తుత క్రికెట్లో లేరంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ మెగాటోర్నీలో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమని తెలిపాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో బౌలర్లను రొటేట్ చేసిన తీరు, ఫీల్డ్ పొజిషన్స్ బ్రిలియంట్ అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. రోహిత్‌పై గిల్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. అవును, కెప్టెన్‌గా రోహిత్ హవా నడుస్తోందని అంటున్నారు. భారత్ ఫీల్డింగ్ టైమ్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు, పన్నుతున్న వ్యూహాలు టీమ్‌కు బిగ్ ప్లస్ అవుతున్నాయని చెబుతున్నారు. హిట్‌మ్యాన్ స్ట్రాటజీలకు ప్రత్యర్థి బ్యాటర్లకు మైండ్‌బ్లాంక్ అవుతోందని అంటున్నారు. మరి.. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ సారథ్యం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adam Gilchrist said – “The strategy and planning of Rohit Sharma was excellent in this T20 World Cup. The way he rotates bowlers against Afghanistan was brilliant”. (Cricbuzz). pic.twitter.com/AvxPQiRnjk
— Tanuj Singh (@ImTanujSingh) June 21, 2024