యువీ 6 సిక్స్ ల మ్యాచ్ రికార్డ్​ బ్రేక్ చేసిన రోహిత్.. ఇది హిట్​మ్యాన్​ రేంజ్!

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ రేర్ రికార్డ్​ను బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. హిట్​మ్యాన్ అనే తన బిరుదుకు న్యాయం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​తో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు.

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ రేర్ రికార్డ్​ను బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. హిట్​మ్యాన్ అనే తన బిరుదుకు న్యాయం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​తో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు.

సింగిల్ హ్యాండ్​తో టీమిండియాను పొట్టి కప్పు సెమీస్​కు చేర్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్​తో కంగారూలను కంగారెత్తించాడు. తుఫాను వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఆసీస్​ బౌలర్లకు చూపించాడు. బౌండరీలు, సిక్సులతో పిడుగులా వారి మీదకు విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లోనే 92 పరుగులతో మ్యాచ్​ను వన్​సైడ్ చేసేశాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మార్ష్ సేన అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. విన్నింగ్ నాక్​తో రెచ్చిపోయిన హిట్​మ్యాన్​కు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్​తో ఎన్నో పాత రికార్డులకు అతడు పాతర వేశాడు.

ఆసీస్​ బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్.. ఎన్నో రికార్డులను చెరిపివేశాడు. పలు కొత్త రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. అతడు ఆడితే ఇలాగే ఉంటుంది అనేలా ఒక్క మ్యాచ్​తో చాలా ఘనతలను అందుకున్నాడు భారత సారథి. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రేర్ రికార్డ్​ను కూడా అతడు బ్రేక్ చేశాడు. ఆరంభ టీ20 వరల్డ్ కప్-2007లో ఇంగ్లండ్ మీద యువరాజ్ సింగ్ 7 సిక్సర్లు కొట్టాడు. అయితే నిన్నటి మ్యాచ్​తో ఈ రికార్డుకు మూడింది. ఆసీస్​పై సూపర్ పోరులో 8 సిక్సర్లు కొట్టి యువీని అధిగమించాడు రోహిత్. హిట్​మ్యాన్ అని తనకు ఉన్న బిరుదుకు సార్థకం చేస్తూ ఇంకా మరిన్ని ఘనతలు అందుకున్నాడు. ఈ మ్యాచ్​తో 200 సిక్సర్ల క్లబ్​లోకి అడుగుపెట్టాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్​లో రెండొందల సిక్సులు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడతను.

కంగారూ మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లో 19 వేల పరుగుల మార్క్​ను కూడా చేరుకున్నాడు రోహిత్. ఒక టీమ్ మీద అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డును కూడా నెలకొల్పాడు. అలాగే ప్రస్తుత పొట్టి కప్పులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్​గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్​లో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టేశాడు హిట్​మ్యాన్. టీ20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అనే ఘనతను కూడా అందుకున్నాడు. ఇలా ఒకే మ్యాచ్​తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటన్నింటి కంటే కూడా వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్ ఓటమికి ఆసీస్​పై ప్రతీకారం తీర్చుకోవడం హైలైట్ అనే చెప్పాలి. హిట్​మ్యాన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ వల్ల బ్యాక్ స్టెప్​కు వెళ్లిన కంగారూ జట్టు.. ఎంత ప్రయత్నించినా మ్యాచ్​పై పట్టు బిగించలేకపోయింది. మరి.. రోహిత్ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments