Nidhan
ఎన్నో ఆశలతో పొట్టి కప్పు బరిలోకి దిగిన దాయాది పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. వరుస ఓటములతో ఆ టీమ్ తీవ్రంగా విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎన్నో ఆశలతో పొట్టి కప్పు బరిలోకి దిగిన దాయాది పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. వరుస ఓటములతో ఆ టీమ్ తీవ్రంగా విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Nidhan
ఎన్నో ఆశలతో పొట్టి కప్పు బరిలోకి దిగిన దాయాది పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. వరుస ఓటములతో ఆ టీమ్ తీవ్రంగా విమర్శలపాలవుతోంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్ఏ మీద ఓడిన బాబర్ సేన.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఫేవరెట్ టీమిండియా చేతుల్లో మట్టికరిచింది. అనంతరం కెనడా, ఐర్లాండ్ల మీద నెగ్గినా లాభం లేకపోయింది. గ్రూప్ టాపర్‌గా ఉన్న భారత్‌తో పాటు అమెరికా సూపర్-8కు క్వాలిఫై అయ్యాయి. దీంతో ఒట్టి చేతులతో స్వదేశానికి పయనమైంది దాయాది జట్టు. పాక్ వైఫల్యంతో టీమ్ ప్లేయర్లపై జోరుగా ట్రోలింగ్ నడుస్తోంది. వీళ్లు దేనికీ పనికి రారంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సీరియస్ అవుతున్నారు. అందరికంటే ఎక్కువగా కెప్టెన్ బాబర్ ఆజం విమర్శలపాలవుతున్నాడు.
బాబర్ అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా ఫెయిల్ అవడం వల్లే టీమ్‌కు ఈ గతి పట్టిందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. టీ20 క్రికెట్లో టెస్టుల మాదిరిగా బ్యాటింగ్ చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. అతడు పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదని, ఇలాంటోడు జట్టుకు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. బాబర్ సరిగ్గా ఆడి ఉంటే ఇతర ఆటగాళ్లు కూడా భయంతో రాణించేవారని చెబుతున్నారు. ఈ విషయంపై అతడు రియాక్ట్ అయ్యాడు. పాక్ ఓటములకు తానొక్కడ్నే కారణం కాదన్నాడు ఆజం. గెలుపైనా, ఓటమైనా టీమ్‌లోని 11 మంది చేతుల్లో ఉంటుందన్నాడు. పదకొండు మంది ఆటను తానొక్కడ్నే ఆడలేను కదా అని చెప్పాడు. ఫెయిల్యూర్‌కు ఒక్కర్నే బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నాడు. చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలవడం సంతోషంగా ఉందని, ఓటములపై సమీక్షించుకుంటామని స్పష్టం చేశాడు.
‘అమెరికా పిచ్‌ల మీద మా బౌలింగ్ సరిగ్గా సరిపోయింది. మా జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే బ్యాటర్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్యూర్ వల్లే యూఎస్ఏ, ఇండియా మ్యాచుల్లో ఓడిపోయాం. వెంటవెంటనే వికెట్లు పడితే ప్రెజర్ మరింత ఎక్కువవుతుంది. మా గేమ్‌తో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారని తెలుసు. ఒక టీమ్‌గా మేం కలసికట్టుగా ఆడలేకపోయామనే బాధ ఉంది. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ల కంటే జట్టుగా మేం ఓడాం. కెప్టెన్ ఒక్కడే టీమ్‌ను గెలిపించలేదు. 11 మంది ఆటగాళ్లంతా సమష్టిగా ఆడితేనే విజయం దక్కుతుంది. వాళ్ల ఆట కూడా నేనే ఆడలేను కదా! అందులోనూ ప్రపంచమంతా చూసే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ప్రతి ప్లేయర్ తమ రోల్ పోషించాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పులు జరిగాయో చూసుకుంటాం. అవసరమైతే మార్పులు చేసుకుంటాం’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. మరి.. పాక్ ఓటమికి తానొక్కడిదే కాదు.. టీమ్ మొత్తానిదీ బాధ్యత అంటూ ఆజం చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Babar Azam said, “as a captain, I can’t play in place for every player in the lineup. We lost as a team, no single person to point out”. pic.twitter.com/8R0zj1d2vg
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2024