iDreamPost

బాబర్ ఆజంపై ఫిక్సింగ్ ఆరోపణలు.. రుజువైతే కెరీర్ ఫినిష్!

  • Published Jun 20, 2024 | 6:45 PMUpdated Jun 20, 2024 | 6:45 PM

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అవి గనుక నిజమైతే అతడి కెరీర్ క్లోజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అవి గనుక నిజమైతే అతడి కెరీర్ క్లోజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Published Jun 20, 2024 | 6:45 PMUpdated Jun 20, 2024 | 6:45 PM
బాబర్ ఆజంపై ఫిక్సింగ్ ఆరోపణలు.. రుజువైతే కెరీర్ ఫినిష్!

టీ20 వరల్డ్ కప్​-2024లో చెత్తాటతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్. సెమీస్ లేదా కనీసం సూపర్-8కు అయినా క్వాలిఫై అవుతుందనుకున్న జట్టు కాస్తా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఫేవరెట్స్​లో ఒకటైన టీమిండియాతో పాటు పసికూన అమెరికా చేతుల్లోనూ మట్టికరిచింది బాబర్ సేన. దీంతో ఆ జట్టును ఇంటా బయటా అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చెత్తాటను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజంను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్నారు. అతడు బ్యాటింగ్​తో పాటు సారథ్యంలోనూ ఫెయిలవడంతో ట్రోలింగ్ స్టఫ్​గా మారిపోయాడు. బాబర్ కనిపిస్తే వదలొద్దని సొంత దేశంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో అతడికి సంబంధించి ఓ విషయం సంచలనంగా మారింది.

పాకిస్థాన్​కు గెలిపించలేకపోయిన బాబర్​పై మాజీ క్రికెటర్లు కూడా భగ్గుమంటున్నారు. అతడు సారథ్యానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీమ్​ను గ్రూపులుగా విడగొట్టి భ్రష్టు పట్టించారంటూ సీరియస్ అవుతున్నారు. బాబర్​ను తీసేసి కొత్త కెప్టెన్​ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. బాబర్ ఫిక్సింగ్ చేశాడంటూ ఓ పాక్ సీనియర్ జర్నలిస్టు చేసిన కామెంట్స్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆజంకు అతడి సోదరుడు రూ.7 కోట్ల విలువైన ఈ-ట్రాన్ కారును గిఫ్ట్​గా ఇచ్చాడని ఆ జర్నలిస్ట్ చెప్పాడు. బాబర్ సోదరుడికి ఏ పనీపాటా లేదని.. అలాంటప్పుడు అంత ఖరీదైన కారు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించాడు.

బాబర్ కార్ల గ్యారేజీలో ఈ-ట్రాన్ కొత్తగా వచ్చి చేరింది. ఇది అతడి సోదరుడు బహుమతిగా ఇచ్చాడు. ఏ పనీపాటా లేని అతడి సోదరుడు ఇంత ఖరీదైన కారును ఎలా గిఫ్ట్​గా ఇస్తాడు? స్మాల్ టీమ్స్​పై ఓడితే.. ఇంత విలువైన ప్లాట్లు, కార్లు ఇవ్వరు కదా? నాతో ఒకరు ఈ విషయం చెప్పారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు సరికాదు అని ఆ వ్యక్తితో చెప్పా. అయితే అతడు వెంటనే ఎవరేం చేస్తున్నారో అందరికీ తెలుసు అని బదులిచ్చాడు’ అంటూ ఆ జర్నలిస్ట్​ బాబర్​ను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఆజంపై ఆరోపణలు రుజువైతే అతడి కెరీర్ ఫినిష్ అని అంటున్నారు. అయితే పాక్ కెప్టెన్ అభిమానులు మాత్రం ఇదంతా ట్రాష్ అని అంటున్నారు. తమ దేశంలో బాబర్ నంబర్ వన్ ప్లేయర్ అని.. దేశానికి ఆడటం ద్వారా వస్తున్న డబ్బులు, పీఎస్​ఎల్ ద్వారా వచ్చే ఆదాయం, యాడ్ రెవెన్యూ.. ఇలా అతడు కోట్లలో సంపాదిస్తున్నాడని చెబుతున్నారు. అతడి రేంజ్​కు ఈ కార్లు చాలా తక్కువ అని.. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. బాబర్​పై వస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి