Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో ఆడే టీమిండియా స్క్వాడ్ గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.
టీ20 వరల్డ్ కప్‌లో ఆడే టీమిండియా స్క్వాడ్ గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.
Nidhan
భారత క్రికెట్‌కు సంబంధించి ఈ మధ్య ఒకటే విషయం బాగా చర్చకు దారితీస్తోంది. అదే టీ20 వరల్డ్ కప్ సెలక్షన్. ఐపీఎల్-2024కు ముందు వరకు ప్రపంచ కప్ టీమ్ గురించి ఓ అవగాహన ఉండేది. వీళ్లు పక్కా జట్టులో ఉంటారని అంతా అనుకునేవారు. కానీ క్యాష్ రిచ్ లీగ్‌లో ఊహకందని రీతిలో ఇతర ఆటగాళ్లు కూడా దుమ్మురేపుతుండటంతో వరల్డ్ కప్ టికెట్ ఎవరికి దక్కుతుందో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకుంటారనేది ఆడియెన్స్‌కే కాదు.. మాజీ ఆటగాళ్లకు కూడా అర్థం కావడం లేదు. రీఎంట్రీలో రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ దుమ్మురేపుతుండటంతో ఆ పొజిషన్‌కు తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది. దీంతో గురువారం బీసీసీఐ అధికారులు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు ఇతర సెలెక్టర్లు, టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీలో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఉండటంతో అక్కడికి వచ్చిన హిట్‌మ్యాన్ హోటల్ నుంచి నేరుగా సెలెక్టర్లతో సమావేశానికి వెళ్లాడని సమాచారం. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారట. మెయిన్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఆడించాలని అందరూ నిర్ణయించారట. అయితే సెకండ్ వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని వినికిడి. సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, రెగ్యులర్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌లో ఎవర్ని ఈ రోల్ కోసం తీసుకోవాలో మల్లగుల్లాలు పడ్డారట.
సంజూ, డీకేని కాదని సెకండ్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారని క్రికెట్ వర్గాల సమాచారం. డీకేకు వయసు మీద పడటం, సంజూ కంటే రాహుల్ సీనియర్ కావడం, కన్సిస్టెంట్గా రన్స్ చేస్తుండటం, వరల్డ్ కప్ స్ట్రీమ్ ఆఫ్ థింగ్స్‌లో ముందు నుంచి ఉండటంతో అతడి వైపే అందరూ మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ సమావేశంలో వికెట్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ యూనిట్ గురించి కూడా డిస్కషన్ సాగిందట. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కన్ఫర్మ్ అయ్యారట. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఫైనలైజ్ చేశారట సెలెక్టర్లు.
ఇంకో స్పాట్ కోసం రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌లో ఎవర్ని తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారట. ఈ ఒక్క పొజిషన్ ఫిక్స్ అయితే బౌలింగ్ యూనిట్ సెలెక్షన్ కంప్లీట్ అయినట్లేనని సమాచారం. అయితే ఐపీఎల్లో అదరగొడుతున్న డీకే, సంజూను కాదని రాహుల్‌ను తీసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లిద్దరికీ బోర్డు హ్యాండ్ ఇవ్వడం సరికాదని చెబుతున్నారు. కాగా, టీమ్ సెలెక్షన్ గురించి బోర్డు నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మీటింగ్ తర్వాత ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి.
Indian team selection reports. [PTI]
– KL Rahul holds the edge over Sanju Samson as 2nd wicket keeper.
– Bumrah, Arshdeep, Siraj, Jadeja & Kuldeep set to be the bowlers.
– Bishnoi vs Avesh vs Axar is fighting for one spot. pic.twitter.com/tMCBildXBU— Johns. (@CricCrazyJohns) April 25, 2024